చేపల తెలివి! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత అడిగాడు "పిల్లలూ ! జలచరాలు అంటే ఏంటి?" " నీటిలో ఉండే ప్రాణులు తాతా! చేపలు మొసలి తాబేలు " ఉషారుగా అరిచారు పిల్లలు. తాత నవ్వుతూ  "మీలాగే మహాతెలివిగల చేపలు ఉన్నాయి. అవి అద్దం లో తమమొహాలను గుర్తిస్తాయి." అనగానే "ఆ! నిజమా?" అంటూ నోరావలించారు పిల్లలు. "అవును. క్లీనర్ రేస్ అనే జాతిచేపలపై పరిశోధనలు చేసి తేల్చారు. ఈజాతి చేపకి ముందు  అద్దంలో దాని మొహం శరీరం ని  చూపారు. ఆపై దాని మెడపై ఒక మచ్చ లాగా  చుక్కని పెట్టారు. మళ్ళీ దాని కి  అద్దం చూపారు. తనని తాను  గుర్తించిన చేప మెడపై మచ్చను చూసి    దాన్ని  శుభ్రపరచాలి అనే తాపత్రయం తో దాన్ని తొలగించే ప్రయత్నాలు  చేసింది. 
జపాన్ లో చేపలపై విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్నారు.క్లీనర్ రేస్ మనిషి లాగా తెలివి బుద్ధి  చాకచక్యంగల చేప.తన జాతితో కలిసికట్టుగా ఉంటూ శత్రువు పని పడుతుంది. మనం దాన్ని తాకితే రియాక్ట్ కాదు. తాకినవారి స్పర్శ వారి మనోభావాలు గ్రహించే శక్తి ఆజాతిచేపలకుంది.బంగారు రంగు చేపలు మనిషి ని గుర్తించగలవుట!      
ఏతావాతా  ఈ ప్ర యోగాల వలన తేలింది ఏంటంటే మిర్రర్ 
టెస్ట్ వలనచేపలు కిల్లర్వేల్ బాటిల్ నోస్ డాల్ఫిన్  తమ మొహం తమ జాతిని గుర్తించగలవు. అపరిచిత చేపలను చూపితే మొహం తిప్పుకుంటాయి."తాత చెప్పిన విషయాలు విన్నాక  కొత్త పుస్తకం చదవాలి అని పిల్లలు పుస్తకాలున్న అల్మారా దగ్గరకు పరుగెత్తారు🌹.
కామెంట్‌లు