:అధ్యయనం- నిత్య విద్యార్థి;- DR. అరుణాకోదాటి -నంది అవార్డు గ్రహీత,- హైదరాబాద్
మనిషి  విజ్ఞానం  ఎంత నేర్చుకుంటే అంత
 ఈ భూగళంలో   ఎన్నో , ఎన్నెన్నో
విషయాలు  దాగివున్నాయి.

ఆకాశం, భూమి, సముద్రాలూ,
ప్రాణులు అయిన  మనుషులు, 
పక్షులులు, జంతువులు. అడవులు... 
ఇలా  ప్రతిదీ  పరిశీలించాలంటే
వాటి గురించి నిశితంగా
అధ్యయనం  చేయాలిసిందే!

 మానవులకు సంబందించి 
జీవనవిధానం , కళలు, సాహిత్యం,
జ్యోతిష్యం, ఇలా  పలురంగాల్లో,రాణిoచాలంటే
ఎంతో  అధ్యయనం  చేయాలిసిందే!

బ్రతుకు తెరువుకు, చదువు కొలమానం,
ఆచదువుకొరకు  అధ్యయనం  చేయాలిసిందే!

ఇవన్నీ  ఒక వేపు  అయితే  మనిషి  సమాజంలో  బ్రతకాలంటే 
 నిత్యం  చుట్టూ జరిగే  విషయాలను అధ్యయనం  చేయాలిసిందే!

మనం  నిత్యం  విద్యార్దిగా ఉండి
ఏదోఒకటి  ప్రతిరోజు  రెండు కొత్త విషయాలను నేర్చుకుంటే
మనము  కూడా గొప్ప విజ్ఞాన వంతుల్లో  మనము  కూడా  ఒకరము  కావొచ్చేమో!
 



కామెంట్‌లు