హారాల చిట్టా !;- గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ముత్యాల హారాల చిట్టా
విప్పి పొందాలిక పట్టా
కావద్దు వసపిట్టా
మీరే ఇక కొర్ర మట్టా !

ముత్యాల హారాలు అల్లి
ముగ్గులు వేయాలి చెల్లి
నీవే మా కన్నతల్లి
వై నిలిచావు మరుమల్లి !

ఈ ముత్యాల హారాలు
మన వేదిక ద్వారాలు
మీకై రేపు మాపులు
చూసే ఎదురుచూపులు !

కనిపెట్టిక నడవండి
హారాలనూ అల్లండి
నైపుణ్యం పెంచుకొండి
వేదికపై మీరుండి !

అల్లిన హారాల నుండి
గ్రూపుల్లోనూ పెట్టండి
చదువరులు చూస్తారండి
మా మాటనూ వినరండి !

మిమ్ముల మెచ్చుకుంటరు
చెలిమిని పెంచుకుంటరు
హారాల నల్లుతుంటరు
వేదిక నెక్కుతుంటరు !


కామెంట్‌లు