శంకరాచార్య సిద్ధాంతం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ జీవితాన్ని ఆధ్యాత్మిక వేత్తలు మూడు రకాలుగా విభజించి లెక్కిస్తారు  ప్రస్తుత జీవితకాలంలో బాల్యమని యవ్వనమని వృద్ధాప్యమని మూడు రకాలుగా విభజించి మనం కాలాన్ని జరిగిపోయిన కాలాన్ని భూతకాలమని జరుగుతున్న దాన్ని  వర్తమానమని జరగబోయే దాన్ని  భవిష్యత్ కాలం అని ఎలా విభజించుకుంటామో అలాగే జన్మలను కూడా మూడు రకాలుగా విభజించారు పెద్దలు  ఏ జీవి అయినా తన పూర్వ జన్మ ఏమిటో తెలియదు ఎలాంటి జన్మ రాబోతుందో అర్థం కాదు  జరిగిపోయిన జన్మను సంచితం అని  జరుగుతున్న జీవితాన్ని ప్రారబ్దం  అని జరగబోయే జీవితాన్ని  ఆగతం అని మూడు రకాలుగా పిలుస్తూ ఉంటాడు  ఇది వేదాంతలు కథలు మనకు చెప్పిన విషయం.సాటి మనిషి ఎవరైనా కష్టాలు పడుతున్నప్పుడు  దానిని కళ్ళారా చూసిన ప్రక్క నివసించే  వారు వీరు గత జన్మలో ఏం పాపం చేసి ఉన్నారు పాపం  ఈ జన్మలో ఇన్ని కష్టాలను ఉపయోగిస్తున్నారు అని జాలి చూపే మాటలు చెప్పడం మనం  వింటూనే ఉంటాం  అసలు జన్మలు ఉన్నాయా నిజంగా అవి ఉంటే మనకు తెలియకుండా ఉంటాయా  అన్న మీ మాంసకులు ఎవరైనా కొంతమంది కూడా  ఉండవచ్చు  సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్న కుటుంబాలను చూసి గత జన్మలో చేసుకున్నారు ఎంతమంది దైవ స్వరూపులకు  అర్చనలు పూజలు చేస్తూ వచ్చారో అంటూ వారిని గురించి  పొగుడుతూ ఉండడం మనం  వింటూనే ఉన్నాం  వేమన కూడా దీనిని సమర్థిస్తూనే చక్కటి ఉదాహరణలతో మనకు పద్యాలను రాసి వినిపించారు. ఊట బావిలో చలమ ఊరినట్లుగా  ఇతనిలో మంచి అలా ఊరుతూనే ఉంటుంది అంటాడు వేమన  హిందూ జాతి మొత్తం  జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్పిన  పూనరపి మరణం పునరపి జననం అన్న విషయాన్ని పూర్తిగా  విశ్వసిస్తూ జీవిస్తున్నారు కనుక  ఎక్కువమంది పునర్జన్మ లోనైనా మంచి జీవితం కావాలని కోరుకుంటూ  మంచి పనులు చేయడానికి సన్నద్ధమవుతున్నారు  ఇది నిజమా కాదా అన్నది ఎవరూ తేల్చలేని సమస్యఅయితే తను చేసిన మంచి పని తనకు ఈ జన్మలో కూడా మంచినే కలుగ చేస్తుంది అన్న విశ్వాసం ప్రతి హిందువులోనూ ఉన్నది కనుక  నూటికి 90 మంది మంచి చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు  కాలవశాన కొద్దీ మళ్ళీ మాత్రం మూర్ఖులు ఉండవచ్చు అంటాడు వేమన వారి రాసిన పద్యం చదవండి.

"పూర్వ వాసన గల పుణ్యాత్ము  కలిమెప్డు యుట చలమరీతి నూరు నెప్పు దెందరికీ నా  సంగ నెప్పటి యట్లుండు..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం