తెలంగాణ ఆదర్శ పాఠశాల లో ప్రతిభ పోటీలు
 తెలంగాణ ఆదర్శ పాఠశాల బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత ప్రతిభా పాటవ పోటీలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల-బచ్చన్నపేట విద్యార్థులు జి.సమీర(10వ.తరగతి),
ఎం.వరుణ్(10వ.తరగతి)పాల్గొని ద్వితీయ బహుమతిగా, 2000 రూపాయల నగదును పారితోషికం,ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. వీరికి బ్యాంక్ ప్రతినిధులు నగదు బహుమతిని పాఠశాలలో అందించారు. విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతి పొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీమతి కె.కృష్ణవేణి గారు మరియు ఉపాధ్యాయ బృందము అభినందించినారు.


కామెంట్‌లు