చెడు కర్మల ప్రభావం; - సి.హెచ్.సాయిప్రతాప్
 కర్మ మార్గాలు బహు విచిత్రమైనవి.ఇది కొందరిని బలహీనంగానూ, మరికొందరిని బలంగానూ చేస్తుంది. కొందరిని ధనవంతులను, కొందరిని పేదలను చేస్తుంది. ప్రపంచంలో జరిగే పోరాటాలన్నీ, అవి ఏమైనప్పటికీ, కర్మ బంధమే.
మంచి లేదా చెడు కర్మల ఆధారంగానే జరుగుతాయి. కాలం బాగున్నప్పుడు శత్రువులు కూడా స్నేహితుల్లా ప్రవర్తిస్తారు.
కాలం యొక్క ప్రభావాన్ని మార్చగల మరియు కర్మ నుండి విముక్తి పొందగల సామర్థ్యం మానవులకు మాత్రమే వుంది.
ఇతరులకు హాని కలిగించే ఉద్దేశ్యంతో చేసే ఏదైనా, అది ఒక చర్య కావచ్చు లేదా ఆలోచన చెడు కర్మ కావచ్చు దానిని మనమే తప్పక అనుభవించాలన్నది శాస్త్ర నియమం. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు.

ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది.
హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవత్గీత వివరిస్తుంది. అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది.
ఎవరు

చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. వాటికి ఫలితాలు తీవ్రంగా వుంటాయి.
మరు జన్మలో మంచి ఫలితాలు అనుభవించాలంటే ఈ జన్మలో చెడు కర్మలకు దూరంగా వుండడం అవశ్యం.
కామెంట్‌లు