సుప్రభాత కవిత - బృంద
మాయని గాయాన్ని 
మరపించే మందేదో
మదినిండా పరిచేసి
మాయ చేసేస్తూ.....

కటిక చీకటి దారిలో
కనుచూపుమేరలో
గోరంత దీపంలా
కనిపిస్తూ....

కంటకాల  రహదారిని
కలల దారిగ మార్చి
కనుల నిండ  వెన్నెల
వెలుగులు నింపేస్తూ...

నిండిన తటాకం దాటి
పొంగిపొరలు కన్నీటిని
వేళ్ళతో తుడిచేసి
వెతలు తీర్చేస్తూ....

మోయలేని  బరువునంత
మోస్తున్న మదికి
భయం లేదని వెన్నుతడుతూ
నీతో నేనున్నానని అంటున్న

 ఉదయానికి ఉద్వేగంగా

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు