తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా చిత్ర కళా ప్రదర్శన

 తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (2 జూన్) సందర్భంలో నగరమంతటా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.  అందులో భాగంగా గత మూడు  (జూన్ 2, 3 & 4 ) రోజులనుంచి జరిగిన చిత్ర కళా ప్రదర్శనలో
తెలంగాణా సోషల్  వెల్ఫేర్ రెసిడెన్షియల్  ఫైన్ అర్ట్స్ పాఠశాల విద్యార్ధులు గీసిన చిత్రాలు చోటు చేసుకున్నాయి.
సోషల్  వెల్ఫేర్ రెసిడెన్షియల్  ఫైన్ అర్ట్స్ పాఠశాల విద్యార్ధులచే చిత్రకళా ప్రదర్శన నగరంలోని యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కర రెడ్డి  స్టేడియంలో జరిగింది. 
ఈ సందర్భంగా కొందరు విద్యార్ధుల అభిప్రాయం. వాటిల్లో సిద్దు గీసిన చిత్రం ఒకటి 
నాగర్ కర్నూల్ స్వస్థలం అయినా సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో ( గురుకుల పాఠశాల) పూర్తిచేసాడు. నెక్స్ట్ బి.ఎఫ్. ఏ. చదువుకుంటాను అని అంటున్న సిద్దు  చిత్రం అందరిని ఆకట్టు కుంది. 
అతి పెద్ద కాన్వాస్ పై ప్రకృతి అందాలు అద్భుతంగా గీసాడు.
======================
ఒక విద్యార్ధి రజిత గీసిన చిత్రం : Woodpecker Busy at poking. 
 (TSWR Fine arts) తెలంగాణా సోషల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్  లో నేను ఏడోతరగతి నుంచి అక్కడే చదువు తున్నాను.  ఇంటర్ చదివాను మేము ఇసీఐల్ లో వుంటాము. 
ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం. ఈ ప్రదర్శనలో నేను గీసిన వడ్రంగి పిట్ట చిత్రానికి ఆక్రిలిక్ కలర్స్ వాడాను . . 
ఈ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ నచ్చింది. 
చాలా బాగా చెబుతున్నారు.
కామెంట్‌లు