సుప్రభాత కవిత ; -బృంద
రంగు రంగుల 
రంగవల్లులేసి
నింగి పొంగిపోతూ
పండగలా ముంగిలి 
నింపుకుంటోంది

పాలమబ్బులకు
తలంటుపోసి
జలతారంచు పావడాలేసి
ముస్తాబు చేసింది

కిరణాలు వచ్చే
తరుణం కోసం
సంబరంగా 
ఎదురు చూస్తోంది

అరవిరిసిన పుష్పాలు
పరిమళాలతో
ప్రభువుకు అంజలి
ఘటించాలని
వేచి చూస్తున్నాయి

అద్భుతమును చూసిన
మనసున మెదిలే మధుర
భావాలకు బాష్యాలు
అక్షరాలు చెప్పగలవా?

అవ్యక్తమైన ఆనందానికి
అర్ధం చెప్పేది
అపురూపమైన
అనుభూతి మాత్రమే

పవళించిన తలపులను
సరికొత్తగా మేలుకొలుపు
ప్రభాసమైన వేకువకు


🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు