శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 దేవదాసి ఆచారం దాదాపు రెండు తరాల క్రితం దాకా ఉండేది.ఆలయంకి ఆచిన్నారి బాలిక అంకితం ఐపోతుంది.తన సంగీతం నాట్యం తో భగవస్మరణలో గడిపిన పవిత్ర స్త్రీ గా ఆమెను గౌరవించేవారు.పెళ్ళి చేసుకోరాదు.క్రమంగా నేడు జోగిని బసివి అనే పేర్లతో వేశ్యలు గా మార్చారు.ఆర్ధికబాధల్తో మగ్గిపోతున్న వీరిని తెలుగు లో వేశ్య అని మహారాష్ట్ర లో మురలీ అంటారు.కాళిదాసు మేఘదూతంలో మహాకాళీ ఆలయంలో దేవదాసీలనృత్యం వర్ణింపబడినది.కానీ వారి కి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా ఉండేవి.రాజుల ఆదరణ పొందారు.
అమృతం కోసం దేవాసుర సంగ్రామం జరిగింది.పాలసముద్రం చిలికాక దానవులకు అమృతం దక్కకపోవడం తోయుద్ధాలు 12జరిగాయి. ఇవే దేవాసుర సంగ్రామాలు!
దేశ్ముఖ్ మరాఠీ పదం.జిల్లాధికారి అని అర్థం.శివాజీ పాలనలో పరగణా అధికారిని దేశ్ముఖ్ అనేవారు.నేటి గవర్నర్ ఇంకా కలెక్టర్ హోదాలో ఆనాటి వారి పదవులకు పేర్లు ఉండేవి.🌹

కామెంట్‌లు