సలహా తెచ్చిన అందలం; - - బోగా పురుషోత్తం

 పాంచాలి నగరాన్ని ప్రవరాఖ్యుడు పాలించే వాడు.  అతని వద్ద పార్థుడు,  ప్రణీతుడు అనే ఇద్దరు భటులు వుండేవారు. ఇద్దరూ రాజుకు నమ్మిన  బంట్లు. రాజు చెప్పిందే వేదం. రాజుపై అనునిత్యం ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడే వారు. దీంతో వారిని రాజు తన ఆంతరంగిక రక్షకులుగా నియమించాడు.
     యుక్త వయసు వచ్చిన కుమార్తెలకు పెళ్లి నిశ్చయమైంది. ఓ రోజు ప్రవరాఖ్యుడు తన భార్య  ప్రవళ్లిక  వద్దకు వెళ్లాడు. భటులను బయటే ఉండాలని ఆజ్ఞాపించాడు. రాజు భార్యను దగ్గరకు పిలిచాడు. ‘‘ మన అమ్మాయికి మగధ రాజ్యాధిపతి మహేంద్ర వర్మతో పెళ్లి నిశ్చయమైంది. ఇక కట్న కానుకలు బాగా ఇచ్చి పంపుతాము.. రేపు పౌర్ణమి మరుసటి రోజు శుభ గడియలు వున్నాయి.. మనం వెళ్లి బంగారు ఆభరణాలు తెచ్చుకుందాం..వెళ్లడానికి నువ్వు సిద్ధంగా వుండు..’’ అన్నాడు.
    అది రహస్యంగా గోడ పక్కనే వున్న కిటికీ లోంచి విన్నాడు ప్రణీతుడు. అయితే రేపు వారికి బలమైన రక్షణ కల్పించాలి..కాని తమ వద్ద వున్న రక్షణ శాఖలో ఎలాంటి ఆయుధాలు లేవు.. పైగా వెళ్లి వచ్చే మార్గం  అటవీ ప్రాంతం కావడం వల్ల ఏమి చేయాలో తోచలేదు. ఈ విషయం పక్కనే వున్న పార్థుడి చెవిలో వేశాడు. ఆ రాత్రి ఇద్దరు భటులూ ఇంటికి వెళ్లి పడుకున్నారు. ప్రణీతుడికి నిద్ర పట్టలేదు. రక్షణ కల్పించడం ఎలా? అని బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు. ఈ విషయం అతని భార్య ప్రమీల గమనించింది ‘  '' ఏ మిటండీ రాత్రంగా నిద్ర పట్టక సతమతమవుతున్నారు..ఏమి ఆలోచిస్తున్నారో కాస్త చెప్పండి..?’’ ప్రశ్నించింది.
      ప్రణీతుడు అసలు సంగతి బహిర్గతం చేశాడు. ‘‘ రేపు రాజుకు రక్షణ కల్పించడం ఎలాగో తెలియడం లేదు.. ముచ్చెమటలు పడుతున్నాయి..!’’ వణుకుతూ అన్నాడు.
     అతని భార్య ‘‘ ఓస్‌ అంతేనా.. మీ రెంత బలహీనులైనా శక్తి వంతమైన ఆయుధం ఒకటుంది..అది మాటల్లో చెబితే నిర్లక్ష్యం చేస్తావు.. నేను చెవిలోనే చెబుతాను.. నీకు ఇష్టం వుంటే అది కాస్త పట్టుకెళ్లు.. నచ్చకపోతే పోనీ..’’ అని చెవిలో గుసగుసలాడిరది.
   అది విన్న ప్రణీతుడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. ‘‘ నీ సలహా భలే..భలే..!’’ మెచ్చుకున్నాడు.
    పార్థుడు ఈ సంగతిని భార్య చెవిలో వేశాడు. ఆమె పక్కింటి వెంకటమ్మకు చెప్పింది.. ఇలా రాజు ఆభరణాల కొనుగోలు సంగతి రాజ్యం అంతా పాకిపోయింది.
   పౌర్ణమి మరుసటి రోజు సమీపించింది. రాజు తన ఆంతరంగిక భటులతో పాటు రక్షకులు వంద మందిని వెంటబెట్టుకుని విరూపాక్షపురానికి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం రాజ కుమార్తెకు అవసరమైన బంగారు ఆభరణాలు, పెళ్లి కొడుకుకు ఇవ్వాల్సిన కానుకలు కొనుగోలు చేసి పెద్ద పెట్టెలో దాచుకున్నారు. పాంచాలి నగరానికి తిరుగు పయనమయ్యారు. ఇప్పుడు రాజు, అతని భార్య, అతని కుమార్తె పల్లకిలో కూర్చున్నారు. కూలీలు భు జం మీదికెత్తుకుని వేగంగా నడుస్తున్నారు. సాయంత్రం అయ్యింది. ఆకలి వేస్తుంటే అందరూ విరూపాక్షపురంలో తెచ్చుకున్న భోజనం తిన్నారు. మళ్లీ రాజు, అతని భార్య, కూతురు పల్లకి ఎక్కారు. కూలీలు మోస్తున్నారు..పల్లకికి అటు ఇటు రక్షక భటులు సాయుధ దళంలా నడుస్తున్నారు. అప్పటికే   చీకటి పడింది.  కొనుగోలు చేసి ఆభరణాల పెట్టెను ముందు నల్గురు మోస్తున్నారు.అది అటవీ ప్రాంతం కావడంతో కాగడాల వెలుతురులో అందరూ ముందుకు సాగుతున్నారు. అంతలో హఠాత్తుగా పది మంది ముసుగు దొంగలు వెనుక  నుంచి వచ్చి వారిని చుట్టుముట్టారు. కత్తులు చూపడంతో రక్షక భటులు భయపడి బంగారు ఆభరణాల పెట్టెను కింద పెట్టారు. రాజు ఆందోళన చెందాడు. ముందు వెళుతున్న  ప్రణీతుడు భయపడలేదు.. ధైర్యంగా వారి వద్దకు వెళ్లి చేతిలో పట్టుకున్న పెద్ద సంచిని తీసి చేతి నిండా తీసుకుని గుప్పెటను దొంగల కళ్లలోకి చల్లాడు. అంతే వారు ఒక్క సారిగా ‘‘ అమ్మో.. రక్షించండి..రక్షించండి..’’ అంటూ హాహాకారాలు పెట్టారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా మిగిలిన దొంగలను వెతికివెతికి వారి మీద కూడా కారం పొడి చల్లాడు.. అంతే దొంగలందరూ భయంతో పరుగులు తీసి అక్కడి నుంచి పారిపోయారు. రాజు జరుగుతున్న తతంగం చూసి మూర్చపోయాడు. ప్రణీతుడు రాజు వద్దకు వెళ్లి అతని ముఖంపై నీళ్లు చల్లాడు. వెంటనే ప్రవరాఖ్యుడు కళ్లు తెరచి ఎదురుగా వున్న ప్రణీతుడిని ‘‘ ఏం జరిగింది?’’ అని ప్రశ్నించాడు. 
    పక్కనే కూర్చున్న రాజు భార్య, కుమార్తె ప్రణీతుడి సాహసాన్ని వివరించారు. రాజు అతడి తెలివిని మెచ్చుకున్నాడు. ‘‘ ఇది నా తెలివి కాదు.. మా భార్య ప్రమీల సలహా’’ అన్నాడు. 
    ఆ తర్వాత ఈ విషయం ఎలా బయటకు పాకిందో చెప్పాలని రాజు ఆంతరంగిక భటులను ప్రశ్నించాడు.
   అది విన్న పార్థుడుకి గుండె ఆగినంతపనైంది. ఏదో ఉపాయం చెబుదామని తన భార్యను సలహా అడిగితే సమాచారం బయటకు పాకేలా చేస్తానను కోలేదు. ఇప్పుడు దొంగలు పడడంతో రాజుకు అనుమానం వచ్చింది. ఆభరణాల కొనుగోలు విషయం తన భార్య వల్లే అందరికీ తెలిసిపోయిందని రాజుకు తెలిస్తే తన ఉనికికే ప్రమాదం వచ్చిందే..’ అని లోలోన మధన పడ్డాడు పార్థుడు. తాను ఈ విషయాన్ని తన భార్యకు చెప్పానని ఆమె సలహా ఇవ్వకపోగా ఈ నోటా ఆ నోటా చెప్పింది..’’ అన్నాడు.
అది విన్న రాజు అతని భార్యను పిలిపించి ‘‘ ఇదంతా నిజమేనా?’’ అని అడిగాడు.
ప్రణీతుడు ‘‘ ఇదంతా నిజమే..పార్థుడు నాకు మంచి మిత్రుడు. కానీ ఈ విషయం బయటకు చేరవేస్తాడని కలలో కూడా ఊహించలేదు..తప్పు అతడిది కాదు..అతని భార్యది..’’ అని చెప్పాడు ప్రణీతుడు. ‘‘అతడిని శిక్షిస్తే పార్థుడి మీద ఆధారపడి జీవిస్తున్న అతని భార్య, ఇద్దరు కుమార్తెల జీవనం దుర్భరమవుతుంది. వారు అనాథలవుతారు. దయచేసి అతడిని విడిచిపెట్టండి.. ఇంకెప్పుడూ ఇలా చేయడని నేను మాట ఇస్తున్నాను..నా మిత్రుడిని వదిలిపెట్టండి..’’ అని వేడుకున్నాడు ప్రణీతుడు.
ప్రణీతుడు మంచితనం రాజును అబ్బురపరిచింది. ‘‘ పార్థుడిని ఏ శిక్ష లేకుండా విడిచిపెట్టండి...’’ అని చెప్పాడు.
పార్థుడి నోటివెంట మాటలు రాలేదు. తాను అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరిగిందే..’’ అని కుమిలిపోసాగాడు. తన భార్యా బిడ్డల శ్రేయస్సు కోరిన మిత్రుడి ఔన్నత్యానికి చేతులు జోడిరచాడు.
    అప్పటికే రాజు ఆజ్ఞతో ప్రణీతుడి భార్య ప్రమీల అక్కడికి వచ్చింది. 
      ప్రవరాఖ్యుడు ఆమెను చూసి ‘‘ నీ సలహా భేష్‌..భేష్‌..నీకు రుణపడి వుంటాం..నీ సలహాతో దొంగల బారి నుంచి మా ప్రాణాలు కాపాడడంతో పాటు విలువైన బంగారు ఆభరణాలు దక్కేలా చేశావు..కృతజ్ఞతలు.. నీ సలహాలు, సూచనలు మా సైన్యానికి అవసరం..ఈ నాటి నుండి నిన్ను సర్వ సైనాధ్యక్షుడిగా నియమిస్తున్నాను..’’ అన్నాడు ప్రవరాఖ్యుడు.
   ఆ మాటతో ప్రణీతుడుకి ఆనందం ఉప్పొంగింది. పక్కనే వున్న పార్థుడు కుమిలిపోవడం చూసి ప్రమీల అతని వద్దకు వెళ్లింది.. నువ్వు కూడా మా సైన్యంలోనే ఉద్యోగిగా వుండు.. శ్రమ, ఓర్పు, ధైర్య సాహసాలు, వివేకంతో పనిచేయి...అందలం దానంతట అదే వస్తుంది..’’ అని ధైర్యం చెప్పింది ప్రమీల.
    ఆ తర్వాత ప్రమీల సలహాలు, సూచనలతో సైనికులు, ఆమె భర్త ప్రణీతుడు, అతని మిత్రుడు పార్థుడు గొప్పగొప్ప విజయాలు సాధిస్తూ ఒక్కో మెట్టు అధిరోహించి రాజు వద్ద ప్రశంసలు పొందారు. 
                                            ,
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం