ఆశ - నిరాశలు.. !;- కోరాడ నరసింహా రావు !

 తొలకరి చినుకులకోసం ఆత్రంగా ఎదురుచూసే రైతు ఆరాటం ఫలించి.., 
    ఆ జల్లులలో నేలతల్లి తడిసి ముద్దై పులకరిస్తుంది అచ్చం రైతు హృదయం లానే !
       అది మొదలు..., 
   దుక్కిదున్ని... నారుపోసి, కలుపు తీసి... చదునుచేసిన పొలంలో ఆశల నాట్లు వేసుకుంటాడు మన రైతన్న !
..  ఉడుపులకోసం... ఎరువులకోసం, పురుగు మందులకోసం...కోతలకోసం,మోతలకోసం... అప్పులవేటలో సగటు రైతు పడే తిప్పలు, ఎవరికి తెలుస్తుంది... !?
      రైతు కూలీలతో కలిసి కూలీ లా పనిచేయటమే కాకుండా రేయింబవళ్లు ఆఁ ఫలసాయం కోసం ఎంత తపిస్తాడో... ఆఁ పంట చేతికందుతుందని ఎన్నెన్ని ఆశలతో ఎదురు చూస్తాడో కేవలం అతనికి మాత్రమే తెలుసు !
      వ్యవసాయానికి రైతుచేత శ్రీకారం చుట్టించిన తొలకరి కన్నెర్ర జేసి అనావృష్టిగా మారుతుందో..., అతివృష్టియై పండిన పంటలను ముంచెత్తి నాశనం చేస్తుందో.... !
     అంత కాలమూ పడ్డ రైతు వ్యయ, ప్రయాసలకు ఫలితమేమిటో... ఆ పరమాత్మకే తెలియాలి... !
        ఎవరెవరికి ఎన్నెన్ని ఎటువంటి రాయితీలు కల్పించినా, కల్పించక పోయినా..., రైతును ఆదుకోవలసిన బాధ్యత ఖచ్చితంగా పాలకులదే... 
      రైతు బ్రతికుంటేనే మనకు బ్రతుకు... !
     వ్యవసాయ నాశనం రైతుకు చావైతే..., అది ఈ మానవ సమాజానికే చావు !!
         వ్యవసాయానికి తొలకరి లా... రైతు బ్రతుకుకు ప్రభుత్వాలు తొలకరులై... ఆ  బ్రతుకులు ఆనంద ఫలసాయాలతో ఎల్లకాలం కల -కల లాడుతుండాలి... !!
        *******
కామెంట్‌లు