కుటుంబమే పునాది (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మన అమృతసంపద,అక్షయసంపద
వాస్తవసంపద కుటుంబమే.
ఆత్మవిశ్వాసం, జాతి అభ్యుదయం
ఒక స్రవంతిగా, ఒక నిర్ఘరిగా
కుటుంబమే సదా నిలిచి ఉంటుంది.
సభ్యత, సంస్కారం, నాగరికత
నిరంతరం కొనసాగడం ప్రపంచపు వింతల్లో ఒకటి. దానికి మన కుటుంబమే పునాది. వేదకాలపు సమాజము, కుటుంబము సర్వసంపూర్ణాలేగాక పరిపుష్టాలుకూడా. మనకు మహోన్నత సంస్కారాలు అందించిన కుటుంబమే మహోత్కృష్టమైన పునాది. మనసు కదిలించి, కరిగించి, ఆరాధించేలా చేసి
నిత్యనూతనంగా నిలిచి ఉన్న కుటుంబమే మన అభివృద్ధికి పునాది.
మనం శాంతులం, దాంతులం, కాంతులం, క్షాంతులం, సంపన్నులం అయ్యి నిలిచేందుకు సదా సహకరించి ఊతగర్ర గా నిలిచేందుకు పునాది ఈ కుటుంబమే!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు