ఆగష్టు 15. వస్తోంది పిల్లలూ
మన బడిని అందముగా...
ముస్తాబు చేద్దాము... !
పరిసరాల చెత్తనంతా...
తీసి పారేద్దాము...,
గోడలకు రంగుల సున్నాలను
... వేయిద్దాము... !
అందముగా ఆకులతో...
తోరణాలు కడదాము...
మూడు రంగులతో జెండాను
సిద్దము చేసేద్దాము !
మన విద్యాధికారిని....
అతిధిగా పిలుద్దాము...
ఆనందముగా మనము...
జెండా ఎగరేద్దాము... !
వందే మాతరమంటూ...
ప్రార్ధన చేసేద్దాము...
సారె జహాఁ సే అచ్చా అని
మాతృభూమిని కీర్తిద్దాము !
మన తెలుగు తల్లికి...
మల్లె పూదండయని....
దేశ భక్తి గీతాలను...
చక్కగ పాడేద్దాము !
మన దేశ స్వాతంత్ర్య....
పోరాటములో...
ప్రాణాలతో సహా
సర్వము త్యాగము చేసిన...
దేశ భక్తులను తలుద్దాము !
మాతృదేశ రక్షణకు ఎళ్లవేళ లా
కట్టుబడి ఉంటామని....
పులకిత హృదయాలతో శపధం చేస్తూ.....
అందరమొకటై నినదిద్దాము !
అందరమూ... మిఠాయిలను
పంచుకుని తిందాము...
జన గణ మన గీతంతో....
కార్యక్రమమునుముగిద్దాము!
ఆగస్టు 15. వస్తోంది పిల్లలూ
మనబడిని అందముగా...
ముస్తాబు చేద్దాము.... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి