డా.దాశరథి జయంతి సందర్భంగా పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్- - చరవాణి :- 6300474467
 (01)
తే.గీ.
మనతెలంగాణమందునతనకలంబు
విప్లవాగ్నులుకురిపించివెల్లివిరిసె
గుబులుపుట్టించెనైజాముగుండెలోన
దాశరథికృష్ణమాచార్యధైర్యశాలి!!!

(02)
తే.గీ.
"నాతెలంగాణకోటిరత్నాలవీణ"
యనునినాదమ్ముపలికెతానద్భుతముగ
యీ"తెలంగాణమారైతుదే"యటంచు
చాటిజెప్పెనుపద్యపూదోటలోన!!!

(03)
తే.గీ.
అలనిజాముదుశ్చర్యలనన్నిజూసి
వ్రాసెజైలుగోడలపైన వాసిగాను
నవతరమునకుస్ఫూర్తినినమ్మకముగ
కల్గజేసెనుయుక్తితో కార్యశీలి!!!

(04)
తే.గీ.
కలముఝళిపించి,గర్జించి,వెలుగుపంచి
అభ్యుదయకవిగాతానునడుగువేసి
యుద్యమానికియూపిరిలూదినిలిచి
దాశరథికృష్ణమాచార్యధన్యతగొనె!!!

(05)
ఆ.వె.
అగ్నిధారకావ్యమబ్బురముగవ్రాసి
పొందుపరిచెభావములనుమెండు
చదువవలెనుసతము,మదియెంతొనుప్పొంగి
కవినిగాంచవచ్చుకన్నులార!!!

(06)
కం.
"కవిసింహ"మెదాశరథియు
కవిలోకమునేలితానుఘనతనుబొందెన్
రవివలెనుదయించియుమా
భవితకునాదర్శమయ్యిపథమునుజూపెన్!!!
(07)
మ.
రసవత్కావ్యములన్ రచించితివి,ధారాపాతమైనీవుమా
రసనాగ్రమ్ముననిల్పినావుభువిపై,రంజిల్లె నీకైతలే
మిసిమిన్ పంచెడిసోయగమ్ముగనసమ్మేళింపసంభావ్య మం
దసమానప్రతిభారవీ!కవివినందానందమోదమ్ముతో!!!
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏



కామెంట్‌లు