నా పంచ పదుల సంఖ్య---
979.
ఆయన సిరి,
కదిలే కవితల శరధి!
తెలుగు సాహిత్యాన ,
మధురా అక్షర జలధి!
తెలంగాణ విముక్తి ఉద్యమ,
భాషా సారథి!
తెలుగుసినిమా ,
అభినవ గేయాల రథి!
నా తెలంగాణ కోటి, రత్నాలవీణ, వాణి వారిది, పివిఎల్!
980.
జననం వరంగల్ జిల్లా,
గూడూరు గ్రామము!
మెట్రిక్ ఉర్దూ,
ఇంటర్ భోపాల్ ,
విశ్వవిద్యాలయము!
ఉస్మానియా విశ్వవిద్యాలయం,
బి.ఏ. (ఆంగ్ల సాహిత్యము)!
సంస్కృతం ,ఇంగ్లీషు,ఉర్దూ,
భాషలలోమంచి పాండిత్యము!
చిన్నతనంలోనే పద్యం, అల్లడం, కడుప్రావీణ్యము, పివిఎల్ !
981.
ఉపాధ్యాయుడు ,
'." ఇన్స్పెక్టర్ ,ప్రయోక్త " ,
. వారి ఉద్యోగము!
సాహిత్యంలో కథ, నాటిక, పాట ,కవిత సృజనము!
పీడిత ప్రజలగొంతుగా మారిన,
చైతన్య రూపము!
నిజాం గద్దె దిగాలంటూ, గర్జిస్తూ రచనా వ్యాసంగము!
జైలు శిక్ష ,జైలు గోడలపై,
బొగ్గుతో పద్య రచనమ,,
పివిఎల్!
982.
భావ ప్రేరిత ప్రసంగాల ,
అద్భుత ఉపన్యాసకుడు!
ఆంధ్ర సారస్వత పరిషత్, స్థాపకుల్లో ప్రముఖుడు!
తెలంగాణ రచయితల, సంఘానికి సరి అధ్యక్షుడు!
ఆంధ్రప్రదేశ్ ఆస్థాన ,
కవిగా విరాజిల్లినవాడు!
గాలిబ్ గజళ్ళు,
గాలిబ్ గీతాలుగా,
అనువాదము ,పివిఎల్!
983.
"అగ్ని ధార, రుద్రవీణ, నవమి", కవితా సంపుటాలు!
కేంద్ర, రాష్ట్ర ,సాహిత్య, అకాడమీ వారి బహుమతులు!
అం.వి.వి. కళాప్రపూర్ణ ,
వేం.వి.వి డి.లిట్. స్వీకారాలు!
"కవి సింహం",
"యువకవి చక్రవర్తి",
వంటి బిరుదులు!
"ఖుషి ఖషీగా నవ్వుతూ"వంటి,
బహు చిత్రాల పాటలు,
పివిఎల్!
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి