పంచపది,--వ్యక్తి కాదు, వ్యవస్థ!;- డా. పివిఎల్ సుబ్బారావు, 94410 58797.
 నా పంచ పదుల సంఖ్య---
964.
దుర్గాబాయి దేశముఖ్, స్వాతంత్ర్య సమర సుచరిత!  
చిన్నవయసు,
   హిందీ పాండిత్యం ,
       సాధించిన ప్రావీణ్యత !
ఆపైన ,
ఆం వి.వి.ఎంఏ( రాజనీతి),
ఎల్.ఎల్.బి అర్హత !
బంగారు గాజులు విరాళం, ఇచ్చిన ఉదారశీలత !
వాలంటీరై నెహ్రూ గారిని,. అడ్డిన కర్తవ్య అంకిత ,పివిఎల్!
965.
రాజ్యాంగసభ, ప్లానింగ్ కమిషన్. లలో సభ్యురాలు! 
సెంట్రల్ సోషల్ వెల్ ఫేర్ బోర్డుకి, అధ్యక్షురాలు!
 హైదరాబాద్ ఆంధ్ర మహిళా, సభకి స్థాపకురాలు !
కళాశాలల, వసతి గృహాల వ్యవస్థాపకురాలు! 
కార్యసాధనలో ఓ "దుర్గ", అత్యుత్తమ సేవకురాలు, పివిఎల్!
966.
దుర్గాబాయి, దేశముఖ్ ,
పద్మ విభూషణ్ సత్కారము! 
ఆం.వి.వి.వారిచే ,
గౌరవ డాక్టరేట్ ప్రదానము! 
వయోజన విద్యా సేవ, 
నెహ్రూ లిటరసీ సత్కారము! 
యునెస్కో పాల్ జి హాఫ్ మన్, అవార్డు స్వీకరణము! 
రాజమండ్రి స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో ,    
 స్ధానం ,పివిఎల్!
_____'___


కామెంట్‌లు