చందమామ, చిత్రాల చేవ్రాలు!;- డా.పివిఎల్ సుబ్బారావు, 94410 58797..
నా పంచ పదుల సంఖ్య--

970.
జీవితంలో దెబ్బది ఆరుఏళ్ళు,  
              క్రియాశీల వైఖరి !

బాల్యంలోనే అందమైన,   
     దస్తూరి, అతని చేతి సిరి!
 
పాఠశాల నోటీసు బోర్డుపై,
        సామెతలు రోజువారి !

చరిత్ర పరీక్షలు సొగసైన,   
             చిత్రాలతో వ్రాసిరి !

డ్రాయింగ్ ఉపాధ్యాయుడు,   
      నాగిరెడ్డి ప్రతిభ గుర్తించే,
                        పివిఎల్!
971.
స్కూ ల్ ఆఫ్ ఆర్ట్స్ నందు   
      ఐదేళ్ల కోర్సుకి ప్రవేశము! 

"మొండి బ్రష్" చిత్రంతో,     ప్రిన్సిపాల్ ఆశ్చర్య చకితము!

"పెన్ &నైఫ్"ఎలా, నేర్చుకున్నావు,అడిగే వైనము!

శంకర్ సమాధానం చెప్పలేక, ప్రదర్శించే మౌనము !

ప్రిన్సిపాల్ ద్వితీయవత్సర, ప్రవేశం అనుమతిచ్చే, పివిఎల్!

972.
తమిళ పత్రిక "కగై మగై",
          చిత్రకార జీవితము !

వేతనం చాలక ,మరికొన్ని,   
        పత్రికల ఆశ్రయము! 

చందమామ పత్రిక అడుగు,
          చిత్రాలతో విచిత్రము !

ప్రధాన చిత్రకారుడు చిత్రతో,   
         సుదీర్ఘ సాంగత్యము!

ఆయన చిత్రాలు చక్కని,
శంకర సంతకాంకితము ,
                         పివిఎల్ ! 
_________


కామెంట్‌లు