స్వర్గ నరకాలు; - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భూలోకంలో ఉన్న చాలామందికి  తప్పు చేస్తే నరకానికి వెళతాం అక్కడే యమ ధర్మ రాజు అనేక శిక్షలు విధిస్తూ ఉంటాడు  కనుక వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ జీవితం లో తప్పులు చేయకూడదు  సమాజానికి మంచితప్ప చెడు చేయకూడదు అన్న నిర్ణయానికి వచ్చి సాధ్యమైనంత వరకు మంచినే చేయడానికి ప్రయత్నిస్తాడు మనిషి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ  స్వర్గలోకానికి వెళ్ళవచ్చు మహేంద్రుని సన్నిధిలో కూర్చోవడానికి అవకాశం వస్తుంది  అని ఆలోచించేవారు  ఎక్కువ అయ్యాడు  అయితే ఏం చేయాలి? ఎలాంటి పనులు చేస్తే స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అన్న విషయం  వారికి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో  ఎవరు దానికి సరియైన గురువో  తెలుసుకొని వారి సహాయాన్ని కోరుకుంటారు. మేధావి వర్గంలో ఒకరిని  మంచివాడుగా  గుర్తించి వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకొని దానికి సంబంధించిన మంచి కార్యాలు చేయడానికి పూనుకుంటాడు  సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్న మూఢనమ్మకాలతో  ఉన్న మనుషుల తత్వాలను మార్చడం కోసం  తాను ప్రయత్నం చేయడం  ఆపదలో ఉన్న వారిని కాపాడడం  దేవాలయాలను  నిర్మించడంలో కానీ  గ్రంథాలయాలను  ఏర్పాటు చేయడంలో కానీ  వితంతు వివాహాలను  ప్రోత్సహించి అవసరమైతే ఆర్థిక సహకారం కూడా అందించి వారిని ఆదుకోవడం లాంటి  మంచి పనులు చేయడానికి  పూను కొని  అందరి చేత మంచివాడు అనిపించుకోవడం  ప్రథమ కర్తవ్యం గా భావించి అలా చేయడం  అలవాటు చేసుకుంటాడు. ఇలా ఇతను మంచి పనులు చేసుకుంటూ వెళితే  యమధర్మరాజుకు అక్కడ పని లేకుండా పోతుంది  ఏ పాపి అక్కడకు రాకుండా  నరక లోకం మొత్తం బోసిపోతుంది. చిత్ర గుప్తుడు తో కాలక్షేపం చేయడం మినహా మరో పని ఉండదు ఏమో ధర్మరాజుకు  ఈ మంచి చేసిన వారందరూ కోరుకునేది మోక్షాన్ని  ఇంద్రున్ని పక్కన కూర్చోవచ్చు శివుని ప్రక్క  తిష్ట వేయవద్దు  అన్న అభిప్రాయంతో పనులను చేస్తూ  చివరకు మోక్షాన్ని పొంది  స్వర్గ లోకానికి వెళితే  అక్కడ తనతో పాటు మంచి పనులు చేసిన వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు  వీరి మధ్య శివ స్వరూపం ఎక్కడా కనపడటం లేదు  దానికి కారణం  ఇంతమంది మధ్యలో ఆయనకు జాగా లేకపోవడం  అంటూ హాస్యోక్తిగా చెబుతున్నాడు వేమన  ఆ పద్యాన్ని చదవండి.

"మాయ నరకమనుసు మాయ రోయక సాటి సమము గనరు దేవ సభల యందు యందరు ఘనులైన హరునకు  తావేది..."



కామెంట్‌లు