పల్లె ప్రగతి;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మా బడిలో ప్రసన్నకుమార్ గారు టీచర్ ఆయన ఆర్మీ మెన్ క్రమశిక్షణకు పెట్టింది పేరు  అప్పటికే వారి అబ్బాయి సత్యమూర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతూ  మధ్యలో ఆపి తేలప్రోలు వచ్చి  చింత చెట్ల కింద కూర్చుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు  ఆ రోజుల్లో అతని ఆలోచన ఏమిటో మాకు అర్థం అయ్యేది కాదు  మా రెండవ అన్న  పుల్లారెడ్డి అతనితో చాలా సన్నిహితంగా ఉండేవాడు నన్ను చిన్ని అని పిలుస్తూ ఉండేవాడు ఉత్తరోత్రా హిందీ పండితుగా వరంగల్ లో కొండపల్లి సీతారామయ్య గారితో కలిసి పీపుల్స్ వార్ గ్రూప్ ను  స్థాపించి ఉద్యమాన్ని నడిపించాడు  ఆ తర్వాత అనేక సందర్భాలలో మేము కలవడం  సిద్ధాంతాలను గురించి మాట్లాడటం జరిగింది  మధ్యలో నన్ను కలవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. మా ఊరి మధ్యలో రామాలయం ఉంది దాని పక్కన వేమన గ్రంధాలయం ఉదయం పత్రిక వచ్చేసరికి తేలప్రోలులో ఉన్న కమ్యూనిస్టు నాయకుడు గుంటక పుల్లారెడ్డి లాంటి వాళ్లంతా వచ్చేవాళ్ళు  మా నాన్న 10 గంటలకు వెళ్లేవాడు అప్పటికే విశాలాంధ్ర పత్రిక ప్రజాశక్తి పేరుతో వచ్చేది  దాన్ని చదవటానికి జొన్నపాడు నుంచి కొండపల్లి సీతారామయ్యగారు సైకిల్ మీద వచ్చేవారు  మా నాన్నకు చాలా సన్నిహితుడు అయ్యాడు వారిద్దరూ కూర్చొని చాలా విషయాలు చర్చించుకునేవారు అభ్యుదయ భావాలు ఉండడం మా నాన్నకు నచ్చింది కారణం ఆయన  దేశం కోసం స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లి ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులకు  ఇచ్చే ఐదు ఎకరాల భూమిని కాదని సమాజ సేవ చేస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించారు. 

కామెంట్‌లు