మా అమ్మ సీతారత్నమ్మ చిన్నతనంలోనే అంటే దాదాపు తొమ్మిదవ సంవత్సరంలో మా నాన్న 12వ సంవత్సరంలో ఉండగా మా నాయనమ్మ మా తాతగారి కుటుంబాన్ని చూసి అమ్మ అందాన్ని చూసి ఎదురు కట్నం ఆ రోజుల్లోనే 600 రూపాయలు ఇచ్చి వివాహం చేశారు గృహిణి అన్న శబ్దానికి ఆమె ప్రతీక మా నాన్న శిష్యులు అనేకమంది సాధు పుంగవులు మా ఇంటికి వస్తూ ఉంటే వారు మా నాన్నగారు భగవద్గీత ప్రచారానికి వెళుతూ ఉంటే వారికి కావలసిన సకల సౌకర్యాలు అమ్మే ఏ లోపము లేకుండా చూసేది వారు వెళ్లి సీతారత్నమ్మ గారు పేరుకు తగిన వ్యక్తి మమ్మల్ని కన్న బిడ్డలలా సాకింది ఆమె చేసే పదార్థాలు ఎంత రుచిగా ఉంటాయో చెప్పలేం అంటూ తమ మిత్రులతో చెప్పుకునేవారు మా నాన్నకు కూడా ఆ వార్త చెప్పేవారు. మా నాన్న చిన్నతనంలోనే దొంగ సాధువుల జీవితాలను అధ్యయనం చేసి కలికాల వేదాంతము అన్న పేరుతో మూడు గంటల నాటకం రంగస్థలం సనాతనంగా నాంది ప్రస్తావనలతో కూడా కలిపి పద్యాలతో వ్రాసింది అనేక చోట్ల ప్రదర్శించబడింది కొంచెం వయసు పెరిగిన తర్వాత మలయాళ స్వామి శిష్యరికంలో గీతా సిద్ధాంతము గీతాసందేశము గాంధీజీ మరణించినప్పుడు హిందూ జాతి పతన కారణములు అరవింద సిద్ధాంతం అమ్మ గీతాలు లాంటివి దాదాపు 25 గ్రంథాలు రచించారు వాటిలో చాలావరకు ప్రత్యేకించి మలయాళ స్వామి జీవిత చరిత్ర బుద్ధునితో పోల్చి వ్రాసిన గ్రంథం( అసంగణాంద గౌతమ బుద్ధులు) దానిని వ్యాస ఆశ్రమం వారే ప్రచురించారు అలా రచయితగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారాయన.
ఎప్పుడు గీతా ప్రచారంతోనే ఆయనకు సరిపోతుంది ఇంటి దగ్గర ఉండే సమయం చాలా తక్కువ నెలకు రెండు రోజులు ఉంటే అది చాలా ఎక్కువ అలాంటి పరిస్థితుల్లో మా పెద్దన్నయ్య కోటిరెడ్డి సహకారంతో అమ్మ మాకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోపం జరగకుండా మమ్మల్ని క్రమశిక్షణతో పెంచి అందరూ మంచి స్థితిలో ఉండేలా తీర్చిదిద్దింది అలాంటి మాతృమూర్తి దొరకడం ఎవరికైనా అదృష్టమే మాకు ఏ చిన్న అవాంతరం వచ్చినా మా మేనమామలు 9 మంది అమ్మ అన్నదమ్ములు ఆదుకుంటూ ఉండేవారు. వారితో మాకు ఎప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా ఇంటిలో పచ్చడి పెట్టాలన్న మా మేనత్తలు వచ్చి అమ్మకు సహకరిస్తూ ఉండేవారు 92 సంవత్సరాల ఆనందమయ జీవితాన్ని గడిపింది అమ్మ జుట్టు తెల్లబడలేదు పన్ను ఊడలేదు అలాంటి అమ్మ దొరకడం మా అందరి అదృష్టం.
మన గన్నవరం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి