ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి తన కన్న తల్లిని ఉన్న గ్రామాన్ని మరిచినవాడు ఉన్నాడా ఉంటే అతను మనసున్న మనిషేనా మా గ్రామం తేలప్రోలు గన్నవరానికి 8 మైళ్ళ దూరంలో ఉన్న అందమైన గ్రామం మేజర్ మైనర్ పంచాయతీలు ఉన్న ఊరు మహాత్మా గాంధీజీ చెప్పడానికి ముందే దళితులకు హరిజనులకు దేవాలయ ప్రవేశం చేయించి వితంతు వివాహాలను సామాజిక స్పృహతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్లిన స్వాతంత్ర్య సమరయోధులు నాలుగు పీహెచ్డీలు చేసిన మేధావులను కన్న గ్రామం మా గ్రామానికి అక్షర జ్ఞానం కలిగించిన ఉపాధ్యాయులు వామపక్ష సిద్ధాంతాలకు తలఒగ్గి చిన్నతనంలోనే అడవులకు వెళ్లి ఆత్మార్పణ చేసుకున్న యువతిని కన్న గ్రామం మాది. మా గ్రామం మాలపల్లి నుంచి రాత్రింబవళ్లు కష్టపడి కలెక్టర్ స్థితికి వచ్చిన వ్యక్తి మావాడు పురాణంలో చెప్పిన అష్టాదశ శివలింగాలను ప్రతిష్టించిన పరశురాముడు మా గ్రామంలో ప్రతిష్టించడం ప్రతిష్టాత్మకమైన చారిత్రక విషయం బాపూజీ కస్తూరిబా సుభాష్ చంద్రబోస్ లాంటి వారి విగ్రహాలతో అల రారే గ్రామం ఉన్నత పాఠశాల ప్రారంభించిన తర్వాత మా గ్రామ సరిహద్దు గ్రామాలలో వారి అందరిని విద్యావంతులను చేసిన గ్రామం నెల్లూరు జిల్లా అనగాని పల్లిలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య గారు తన సొంత గ్రామాలుగా గన్నవరాన్ని, మా గ్రామాన్ని ఎన్నుకొని వామపక్ష సిద్ధాంతాలను కూలంకషంగా ప్రతివారికి అర్థమయ్యే పరిభాషలో తెలియజేసిన వ్యక్తి మా కుటుంబ సభ్యులు వారు.తన కార్యక్రమం ఏ వేదికపై ఉన్నా మా నాన్నగారే అధ్యక్షులుగా ఉన్నారు.
విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికల సంపాదకుడు బొమ్మ రెడ్డి మా గ్రామవాసి చదువు కోసం ఇతర దేశాలు వెళ్లి ధనాన్ని సంపాదించి గ్రామానికి ఎంతో సేవ చేసిన వారు మా గ్రామ వాసులు వైద్య వృత్తికి అంకితమై ప్రజలలో పేరు తెచ్చుకున్న వైద్యులు మా గ్రామ వాసులు మా కుటుంబ సభ్యులు వైద్యం చేపట్టి 20 శాతం మందికి ఉచితంగా వైద్యం చేయడానికి కంకణం కట్టినవాడు ఎన్నో సంఘసంస్కరణలు చేసిన ముగ్గురు మా గ్రామవాసులు మరి మా గ్రామంలోనే ఇంతమంది ఉన్నతులు ఉన్నప్పుడు మన గన్నవరం తాలూకాలో మరి ఎంత మంది మేధావులు ఉన్నారో మాకు తెలిసినంతవరకు వారి గురించిన వివరాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం.రేపటి నుంచి ఆ యజ్ఞం ప్రారంభం.
మన గన్నవరం ; -ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి