*హనుమాన్ చాలీసా - దోహా*
 *పవనతనయ సంకట హరణ*
*మంగళ    మారుతి       రూప !!*
*రామ  లఖన  సీతా  సహిత*
*హృదయ బసహు సుర భూప !!*
తా: తత్వ జ్ఞానము ఇచ్చే వాడా ! దుష్ట మంత్రాలను నిలువరించేవాడా ! హనుమా ! పవనతనయుడా, అన్ని కష్టాలు తొలగించేవాడా, చూడగానే మనసుకు హాయిని కలిగించే సుందర రూపము కలవాడా, సకల శుభాలను ఇవ్వ గలిగిన వాడా, సీతా రామ లక్ష్మణులను మనసులో స్థిరంగా నివాసం ఉంచుకున్న వాడా, మారుతీ నీవు నా మనసులో నివాసం ఏర్పరుచుకుని నాతో ఉండు స్వామి.........అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం:  పరమాత్ముని పైన నమ్మకం తో ఉన్న వారు అందరూ చేయవలసిన ప్రార్థన ఇది, అని తులసీదాసు గారు మనకు తను చేసి చెపుతున్నారు. ఈ దోహా నుండి మనం నేర్చుకోవలసిన మొదటి విషయం, "నీవు చేసేదే ఇతరులకు చెప్పు" అని.  చాలీసా మొత్తం పాడుతున్నప్పుడు మనకు తెలిసేది, సర్వ కాల సర్వ అవస్థల యందు మనతో ఉండ వలసినది, ఉండ గలిగేది ఒక్క పరమాత్మ మాత్రమే కానీ, వేరే ఏదీ కాదు, అని. హనుమాకు మారు రూపమైన తులసీదాసు గారు ఈ మాటలు చెపుతున్నారు అంటే, మనకు నమ్మకం లేకపోయనా, నమ్మికతో ఉండాలి అంతే. రామదాసు కీర్తనలతో రాముని కీర్తిస్తున్నాము. అలాగే, తులసీదాసు చాలీసా తో హనిమను కీర్తించి రాముని చేరుకుందాము. ఎంతో మహిమాన్వితమైన చాలీసా ను మనసులో నిలుపుకుని, గొంతుతో పాడి, హనుమ ద్వారా రామ పాదాల చెంతకు చేరే సదవకాశాన్ని ఇవ్వమని...........రామ పాదారవింద సేవిక అయిన జనకసుతను వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు