ఆ యనకు భవిష్యత్తులో జరిగేది తెలుస్తుంది. కానీ
ముందు శ్రీ కృష్ణుడు బ్రాహ్మణ వేషధారి అయి సహదేవుని పలకరిస్తే. కృష్టా నువ్వు వచ్చిన పని చెప్పు దీనికి మారు వేషం ఎందుకు అంటే కృష్ణుడు
నవ్వి నీకు భవిష్యత్తు గురించి తెలుస్తుంది కాబట్టి
ఎవ్వరికీ చెప్పను అని ప్రమాణం చేయించుకున్నాడు
అప్పటి నుంచీ సహదేవుడు చాలా చాలా తక్కువ
మాట్లాడే వాడు .అదీ ప్రశ్నకు ప్రశ్నే సమాధానం లా
మాట్లాడేవాడు .
సహదేవుడు ఒకేసారి వంద శరాలు
ప్రయోగించగల నైపుణ్యం గల వాడు. గొప్ప వీరుడు.
కత్తి యుద్దం లో కూడా మంచి వీరుడు.అందుకే
శకుని అంటే భరించలేని కోపం అసహ్యం ఉన్నా దాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు.అంత మంచి ఉన్నతమైన గుణ సంపత్తి గలవాడు.ధర్మరాజుకీ
చాలా చాలా ఇష్టమైన తమ్ముడు ,ప్రియాతి ప్రియమైన వాడు.
శకుని మీద కోపమూ అసహ్యం మనసులోనే కురుక్షేత్ర సంగ్రామం వరకూ తన మనసులోనే
దాచుకున్న మహనీయుడు. అందుకే ఆయుద్ధంలో
కొన్ని బాణాలతో శకునిని గాయపరిచి ఆఖరున కత్తి
తో కసి తీరా తల నరికి చంపిన వీరాధి వీరుడు
సహదేవుడు పాండవులు,కౌరవు లందరిలో మహా
అందగాడు సహదేవుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి