అవును! నేను రానిక నీకోసం
ఏమి ఉందని? ఏమి ఉంచావని?
పువ్వూలేదు, ఆకూలేదు రెమ్మాలేదు. కొమ్మాలేదు, మొక్కాలేదు, చెట్టూలేదు.
నీతోటలోకి రాదిక చిలుకా, కోయిలా.
రాదిక నెమలీ, కుందేలూ, కోతీ. నీకోసం రాదిక వసంతమాసం కూడాను. పాదులుతీసే మాలులూ లేరు. పరుగులుతీసే బాలలూ లేరు. నీటి గలగలలూ లేవు రంగుల హరివిల్లూ లేదు. బుద్ధుడుపుట్టిన మద్దిచెట్టూలేదు. ఆయన జ్ఞానమొందిన రావిచెట్టూలేదు. దత్తుడుఉండే మేడిచెట్టూలేదు. కనీసం సాయిబాబా ఉండే వేపవృక్షమూలేదు. ఉత్సాహం, ఉల్లాసం,సంతోషాలు మచ్చుకైనాలేవు. ఉన్నదంతా ఆశలు ఉడిగి ఎండిన చెట్ల ఉరికొయ్యలు మాత్రమే. ఎలా? ఎలా రమ్మంటావ్ నన్ను నీ ఊహలతోటలోకి? !!!
+++++++++++++++++++++++++
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి