సంధికాలపు సందేహం (చిట్టి వ్యాసం)- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కాలపురుషుడు మరోచొక్కాను వదిలాడు. మారింది కేవలం చొక్కానే. శరీరం కాదు. అంటే...., అదేకాలం మరోరంగు చొక్కాతో. అదే ప్రవృత్తి. కాని వివిధ రూపాలుగా మారి. అదేసారము. కానీ …సంఘటనల రూపుమార్చుకుని. తన ప్రభావం చూపబోతోందా? యుగాలనుండి జగాలనిండా అదే ప్రేమ. అదే జాలి. అదే స్నేహం. అదే కాఠిన్యం. అదే క్రౌర్యం. అదే కోపం. ఆరు ఋతువులు. ఆరు రుచులు మారలేదు. కానీ… సప్తవర్ణాల హరివిల్లులా జీవితం క్షణక్షణం మార్పులతో, అష్టైశ్వర్యాలతో, 'నవ'భయాలతో, నవ్యోల్లాసాలతో, నడుస్తూ, కుంటుతూ, పరుగెడుతూ కాలం సకాలంలోనే క్రమంగా సక్రమంగా వెళ్ళిపోవాలని అనుకుంటుందేమో. మేం మాత్రం పురోగమనమంత్రంతోనే పురోగమిద్దామని, పొరపాట్లను పొరపాటున కూడా పునరావృతం కానివ్వమని, గతకాలపు గాయాలను గేయాలుగా మార్చుకుని అందమైన భవితకు ఊహాగానాలు చేస్తున్నాం. మరి ఇవి నెరవేరేనా? అనే మా ఈ సంధికాలపు సందేహం!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు