గురువు ;- జి.లింగేశ్వర శర్మ
అజ్ఞానముదొలగించియు
ప్రజ్ఞనువికసింపజేసిపాఠీనుడిలో
జిజ్ఞాసనుపెంచిగురువు
విజ్ఞానపుకాంతినింపివెలుగులుపంచున్

విద్యాభ్యాసముకొరకై
విద్యాలయమందుజేరువిద్యార్థులకున్
విద్యాబుద్ధులునేర్పును
విద్యాలయమునగురువులువిజ్ఞానముతో

ఎందరికోప్రేరణయై
ముందుకునడుపుచునిరతముముద్దుగవిద్యా
గంధముపంచెడిగురువుకు
వందనమిడుచుంటినేనువాత్సల్యముతో


కామెంట్‌లు