సరస్వతీ నది! అచ్యుతుని రాజ్యశ్రీ

 "తాతా!మనదేశంలో అతిపవిత్ర నది ఏదీ?" బడి నుంచి వస్తూనే అడిగాడు శివా. "ఓహ్! అదికూడా తెలీదా? గంగానది " వెక్కిరిస్తు అంది జయ.""తప్పు! సరస్వతి నది" తాత మాటలకి తెల్లబోయారు.సరస్వతి చదువుల తల్లి కదా? వారి సందేహం అర్ధం చేసుకుని తాత ఇలా అన్నాడు " పురాణాల ప్రకారం గంగానది కన్నా ముందు భారత దేశంలో ఓపెద్దనది ఉండేది. ఋగ్వేదంలో పేర్కొన్నారు. దాని పేరు సరస్వతీ నది.భారతంలో కూడా ఉంది. కానీ అది ఇప్పుడు కంటికి కనిపించకుండా మాయమైంది."" అవును తాతా! ఇప్పుడు చెరువులు కూడా కబ్జాకి గురియై కాంక్రీట్ జంగిల్స్ వెలుస్తున్నాయి. బావి దిగుడుబావి అంటే మాకు తెలీదు " పిల్లలతో తాత అన్నాడు " సరస్వతీ నది మాయమైన చోటుని వినాశనా అని పిలుస్తారు. సట్లజ్ యమున నదులు సరస్వతీ నది లో కలిసేవి ప్రాచీన కాలంలో. ప్రయాగని త్రివేణి సంగమం అంటారు. ఎందుకంటే గంగ యమున సరస్వతి కలుస్తాయి కాబట్టి. నదులకథ సరస్వతీ తోటే మొదలు. మొట్టమొదటిగా పుష్కరాల లోని బ్రహ్మ సరోవరంలో సరస్వతీ పుట్టింది
హిమాలయాల్లోపుట్టి హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్  ఆపై పాకిస్తాన్ లో సింధుప్రాంతంలో అరేబియా సముద్రం లో కలుస్తుంది. పురాణం ప్రకారం లక్ష్మి సరస్వతీ గంగ  శ్రీమహావిష్ణువు దగ్గర ఉండేవారు. గంగ ఓరోజు అంది"లక్ష్మి సరస్వతీ అంటే కాస్త విష్ణువు మక్కువ ఎక్కువ చూపుతాడు". ఇంకేముంది?గంగ సరస్వతిమధ్య  గొడవ మొదలైంది. లక్ష్మి వారి కొట్లాటను తీర్చబోయింది.కానీ సరస్వతి కోపం నసాళానికి అంటి"లక్ష్మీ!నీవు మొక్క గా గంగ నదిగా మారుతారు" అని శపిస్తుంది.   గంగ కూడా "నీవూ నదిగామారి పాపులు మునిగితే  వారి పాపాలు నీకురావాలి" 
 అని దెప్పింది. విష్ణువు వారిని శాంతింపజేశాడు.కలియుగములో 10వేల ఏళ్ళు పూర్తి కాగానే సరస్వతీ నిజరూపంతో వైకుంఠం చేరుతుంది అని  శాపవిముక్తి చెప్పాడు.అందుకే  నేడు సరస్వతి కనపడకుండా మాయమైంది.దీని అంతరార్థం ఏమంటే  జలాల్ని మనుషులు పుణ్యం వస్తుంది అనే పేరు తో  కలుషితం చేస్తున్నారు. ఇలా దైవం పేరు తో నదుల్ని కాపాడారు మన పూర్వీకులు. కొన్ని సమయాల్లో మాత్రమే  నదీస్నానం కి అనుమతించారు. నేడు రవాణా సౌకర్యాలు పెరిగి నదుల్ని మురికిగా మారుస్తున్నాము. కలికాలం అంటే కలిపురుషులం మనమే!" తాత మాటలకి ఆలోచనలో పడ్డారు పిల్లలు 🌷
కామెంట్‌లు