మాయలో పుట్టింది
మాయగా మారుతోంది
మాయమై పోతోంది
ప్రపంచమే మాయ !
*******
ఎన్నెన్నో ప్రణాళికలు
ఊహా ప్రపంచంలో... !
ఎంతవరకో....
ఈ జీవితం !!
******
అంతా మాయే....
అని తెలిసినా....
మనిషి ఉన్నంతవరకూ
యాతనలే.... !
******
గమ్యం చేరుతామో
చేరలేమో... !
భద్రమో - చిద్రమో
ఐనా తప్పదు ప్రయాణం!!
. *****
సత్యం తెలుసుకున్నోడు...
ఈదుతున్నాడు !
తెలుసుకోలేదు
మునిగిపోయాడు !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి