మనసు, మమత, బంధం, అనుబంధం, రక్తసంబంధం. ఇలా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా.. ఈ కాలంలో మనుషుల్ని నడిపించేవి మాత్రం ఆర్థిక సంబంధాలే. మన దగ్గర నాలుగు డబ్బులు ఉంటేనే ఎవరైనా మనల్ని ఖాతరు చేసేది. అందుకే మనిషికి ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం.
డబ్బు గురించి, మనిషి వెంట చివరగా ఏమి వస్తుంది అనే విషయం గురించి ఒక శ్లోకం ఉంది...
ధనాని భూమౌ పశవశ్చ గోష్టే నారీ గృహద్వారే, జనః శ్మశానే
దేహాశ్చితాయాం పరలోక మార్గే, కర్మానుగో గచ్ఛతి జీవఏకః
సంపాదించిన ధనం భూమిపై ఉండిపోతుంది. పశువులు గోష్ఠంలో మిగిలిపోతాయి. భార్య గృహద్వారం వద్ద ఆగిపోతుంది. బంధుజనులు శ్మశానం వరకూ వస్తారు. దేహం చితిలో కాలిపోతుంది. పరలోకమార్గంలో, జీవుడిని వెన్నంటి వచ్చేది కర్మఫలం మాత్రమే.
ధనము ప్రముఖుల వ్యాఖ్యలు ఈ వ్ ఇధంగా వున్నాయి..
(1) ధనాన్ని ప్రేమించడమే అన్ని పాపాలకు మూలం (న్యూ టెస్ట్ మెంట్)
(2) నీకు డబ్బుంది ఆనందించు. కాని ఆనందంలో ఇతరులకు కూడ చోటివు (స్వామి వివేకానంద)
(3) ధనము ప్రమాదకరమైన అధినేత, అలాగే గొప్పసేవకుడు (బార్నమ్)
ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి వాస్తవమై మానవజీవితాలను శాసిస్తున్నది. దుష్టుడైనా, దుర్మార్గుడైనా ధనముంటే దేవుడని కొలుస్తుందీ లోకం.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలై ఒకరికొకరికి సంబంధాలు లేని జీవితాలై మానవత్వాన్నే వెక్కిరిస్తున్నాయి.
ఉత్తమం స్వార్జితం విత్తమ్/మధ్యమం పితురార్జితమ్/అథమం భాత్రి విత్తంచ/ స్త్రీ విత్తమథమాధమమ్’… స్వార్జిత ధనంతో జీవయాత్ర సాగించడం ఉత్తమం. పితురార్జితంతో గడపడం మధ్యమం. సోదరుల సంపాదనపై బతకడం అథమస్థితి. స్త్రీల సంపాదనపై జీవించడం అత్యంత దయనీయం అని సారాంశం. అయితే మారుతున్న కాలంలో సంసారం వెళ్లదీయడానికి స్త్రీపురుషులు కష్టపడడం అనివార్యం కనుక స్త్రీ సంపాదనపై ఆధారపడడాన్ని తప్పు పట్టనవసరంలేదు. అయితే సంపాదించే పురుషుడికే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి