ఒక ఆల్ రౌండర్ శాస్త్రవేత్త కహానీ! - అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆయన దేశభక్తుడు విద్యార్థులకు ప్రీతిపాత్రుడు.సితార్ వైలెన్ వాదనలో ఆరితేరారు.హాకీ టెన్నిస్ చెస్ చిత్రలేఖనం మట్టితో బొమ్మలు చేయడం హాబీలు.ఫ్యాన్సీడ్రెస్ పోటీలో పాల్గొనేవారు.ఆసక్తిగా గంటలతరబడి మాట్లాడే శక్తి సత్తా ఆయనకుంది.గొప్పమేధావి భూగర్భ వృక్ష శాస్త్రాలు మధించిన శాస్త్రవేత్త.స్వతంత్రం రాగానే
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించమని వచ్చిన ఆహ్వానంని తిరస్కరించారు.కేవలం 57ఏళ్ళ
ప్రాయంలో తనువు చాలిస్తే ఆయన భార్య సావిత్రి
భర్త ఆశయాలు నెరవేర్చిన సతీతిలకంగా నిలిచారు.కేంబ్రిడ్జ్ లో చేరాక"నాకు అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు.నేను ఇక్కడ ఉండను" అని లండన్ లో వైద్య విద్యాభ్యాసం చేస్తున్న అన్న దగ్గర భోరుమని ఏడ్చిన ఆయువకుడు ఎలాగైతేనేం బయాలజీ భూగర్భ వృక్ష శాస్త్రాలలో ఎం.ఎస్సీ డిగ్రీ తోపాటు అవార్డు అందుకున్నారు.డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొంది 1920లో
ఇండియన్ గోండ్వానా ప్లాంట్స్ ఎ రివిజన్ అనే పుస్తకం నా ప్రచురించారు.లక్నో యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చిన్న క్లాసుల వారికి కూడా బోధించేవారు.విద్యార్ధులను విమర్శించకుండా సొంతం గా ఆలోచించేలా చేయాలి అనేవారు.కన్న పిల్లలు లేని ఆయనకి విద్యార్థులే సొంత పిల్లలు.తన కింద ఉద్యోగుల దగ్గరకు వెళ్లి స్వయంగా కావాల్సినవి అడిగి తీసుకునేవారు.నాణాల అధ్యయనం చేసి ది టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్ కాయిన్స్ ఇన్ ఏన్షియెంట్ ఇండియా అనే పుస్తకం రాశారు.1946లో లక్నోలో తమ సొంత ఖర్చులతో వనస్పతులు వాటి అవశేషాలకి సంబంధించిన సంస్థను నెలకొల్పారు.కానీ తన కల పూర్తిగా ఫలించకుండానే అమరులైనారు.🌺
1952లోసావిత్రీ సహానీ కృషి ఫలితంగా ఆ సంస్థ బిల్డింగ్ కి నెహ్రూ ప్రారంభోత్సవం చేసి బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బాటనీ అని పేరు పెట్టారు.ఆల్ రౌండర్ బీర్బల్ సహానీ కహానీ ఇది 🌹
కామెంట్‌లు