అక్షర శిల్పి;పద్మశ్రీ కళా ప్రపూర్ణ,, పద్మభూషణ్, డాక్టర్జ్ఞానపీఠ పురస్కృతులు సి.నారాయణరెడ్డి గారి 92 వ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నా అక్షరాంజలి...----------------------------------------ఏ కవి ప్రతిభా పాటవాలను వీక్షించితెలుగు కళామ తల్లి పులకించి పోయిందోఏ కవి కలాన్ని చూసిఅక్షరాలు ఆనంద తాండవం చేసాయోఏ కవి రాస్తేపగలే వెన్నెల కు( వి)రిసిందోఏ కవి కవితావనంలోలలిత పద సౌరభం గుబాళించిందోఏ కవి గళం వింటేవీనులకు విందయిందోఏ కవి లేఖిని నుండికొంగ్రొత్త సాహితీ ప్రక్రియలు పురుడు పోసుకున్నాయోఏ కవి ఇంటి పేరుకుకవిత చిరునామా అయ్యిందోఏ కవి గేయంవెండి తెరకు వెన్నెల సంతకం అయ్యిందోఏ కవిని వీక్షిస్తేతెలుగు సంస్కృతీ , సంప్రదాయాలు సాక్షాత్కరించాయో ..ఏ కవి ధిషణకుపదవులు ఏరి కోరి వరించి మురిసిపోయాయోఏ కవి వల్లతెలుగు కీర్తి పతాక విశ్వవ్యాప్తమయ్యిందోఏ కవి విద్వత్తు నచ్చిజ్ఞానపీఠమే మురిసిపోయిందోఏ కవి , కవిత్వాన్నితన ఊపిరిగా శ్వాసించి , శాసించాడోఆ కవే ..మహాకవి సినారె!ఆ మహాకవితెలుగు కవితై నిలిచాడుతెలుగు పాటై వెలిగాడుతెలుగు మాటై మిగిలాడుతె(వె )లుగు బాటై వెలిసాడుఅక్షరానికి మరణం లేదుఅక్షరమైన ఆ సుకవికీమరణం లేదు ;జననం తప్ప !ఆ మహాకవి' సినారెకివేనా అక్షరాంజలి!
వెండి తెరకు వెన్నెల సంతకం సినారె ;---బాలవర్ధిరాజు మల్లారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి