మనసున్న మానులు (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 నిబిడాంధకార మృత్తికాకుహరభంజన చేసి, రెండాకుల కిసలయంతో కిలకిలనవ్వుతూ, ఎకరాలకొద్దీ విస్తరించే భూరుహములు కదిలే, కదలని, కదిలీకదలని జీవులెన్నింటికో సాయంచేసే పెద్దమనసున్న స్థావరదేవతలు. ఆకులు, శాఖలు, కొమ్మలు, రెమ్మలు, పూవులు, కాయలు ఈకలుగా ఒళ్ళంతా కప్పుకుని పచ్చని నెమళ్ళలా పురివిప్పుతాయి. జనాలకు వనాలను నజరానాలనిస్తాయి గాయాలపాలైన ప్రతిసారీ పరిమళాలగేయాలు పల్లవిస్తాయి. తలతెగ్గోసినప్రతిసారీ కసితో మరిన్నితలలు పైకెత్తుతాయి. గ్రీష్మ హేమంత శిశిర కష్టాలకడలిలోనైనా నిట్టనిలువుగా నిలిచే ఉంటాయి. వసంతాగమనంకోసం ఆశావాదిలా నిరీక్షిస్తూనే ఉంటాయి. మానవాధముల కౄరచర్యలన్నింటినీ క్షమించి, వారికి వరాలిచ్చి, పూర్తికాలపు రక్షణకవచమై, తోడునీడై నిలిచే మంచిమనసున్న మానులు సాక్షాత్తూ భూమిపైవెలసిన దేవతలేసుమా!!!

+++++++++++++++++++++++++


కామెంట్‌లు