పల్లవి :-
మాయలో పుట్టి, మాయలో పెరిగి, మాయ మై పోవు మనుజులూ ..
మాయని తెలియక, మోహము పెంచుకు, మిడిసిపడెదరు మూర్ఖులయీ !
మిడిసిపడెదరు మూర్ఖులాయీ !!
"మాయలో పుట్టి..... "
చరణం :-
సృష్టిలో లేని... కులమలు , మతములు ...
ఉచ్చ,నీచముల సృష్టించు కుని...
మిడి - మిడి జ్ఞానపుబేధములతొ...వాదులాడుకుని చచ్చె దరు !
వాదులాడుకునిచచ్చెదరు !!
" మాయలో పుట్టి... "
చరణం :-
ఆ... రూప, గుణ రహిత దివ్యత్వమునకు కథల నల్లుకుని కులికెదరు !
సత్యము నెరుగక, భ్రమలలో మునిగి, తేల లేక... గిల - గిల లాడు తున్నారు !
గిల - గిల లాడుతున్నారు !!
వీరుజ్ఞాననావలో...పయనించి
గమ్యమునే చేరెదరో... లేక అందులోనే....
ఈది - ఈది... మరి ఈదలేక...
ఆ మాయా జలధిన మునిగెదరో... !!
ఆ... మాయా జలధిన మునిగెదరో...... !
" మాయలో పుట్టి..... "

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి