* కోరాడ మినీలు *

    @  జీవితం లో ధనం ... !
          ******
జీవితంలో... డబ్బులేనిదే ఆనందం రాదనుకున్నాడు!
  డబ్బుకోసం... ఆనందాన్ని వదులుకున్న తరువాత.... 
  ఆనందాన్నివ్వని డబ్బు... 
   నిరర్ధక మంటున్నాడు !!
         ******
సంపాదనకోసం.... 
  ఆరోగ్యాన్ని లెక్కచేయ్యలేదు !
    ఆరోగ్యం కోసం... 
      సంపాదించిందంతా ధారపోసాడు !!
    , అయినా... మనిషి బ్రతకలేదు... !
              ******
ఏ తాపత్రయాలూ లేవు.... 
    కూటికోసం కష్టపడుతున్నాడు !
     కష్టపడటం కోసం... 
       తింటున్నాడు !!నిశ్చింతగా 
వందేళ్లు ఆనందంతో  బ్రతికాడు ఆరోగ్యంగా .. !
         *******
ఆడను  అన్నవాడు వ్యర్థుడు 
  ఆడలేక, ఆగిపోయినవాడు అసమర్ధుడు !
  ఆడి,గెలిచినవాడు ఘనుడు !
ఓడినా, ఆడేవాడు... 
   వీడికన్నా గొప్పవాడే !!
ఓడినా, గెలిచినా.... 
   కడదాకా ఆడి, నిలవటమే... 
      నిజమైన జీవితం... !
  పుట్టినాక,ఇలానే జీవించాలి!!
     *******
కామెంట్‌లు