ధ్వని- ప్రతిధ్వని;- ఎస్ మౌనిక

 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ. మరి మీరు? విషింగ్ యు ఎ వెరీ హ్యాపీ డే!🤝🤝 ఈరోజు ఇంకో కొత్త ఆసక్తికరమైన అంశంతో మీ నేస్తం రెడీగా ఉందిగా! దాన్ని తెలుసుకోవడానికి మీరు రెడీనా మరి? తెలుసుకుందామా అదేంటో? సముద్రం చాలా లోతుగా ఉంటుంది కదూ! అది ఎంత లోతు అని మనకు ఎలా తెలుస్తుంది? నదులు కూడా మన ఎత్తు కంటే చాలా లోతుగా ఉంటాయి. దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మనం ధ్వనితో లోతును కొలవచ్చు. ధ్వని అంటే సౌండ్. ధ్వనిని ఉపయోగించి లోతుని ఎలా కనుక్కుంటారు?  ఏం లేదండి! ఏదైనా ఒక పడవని నీటిలోకి పంపిస్తారు. ఆ పడవలో ధ్వని ఉత్పత్తి చేసేలా ఒక పరికరం ఉంటుంది. అది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసిన ధ్వని నీటిలోతుకు వెళ్తుంది. దానికింది అడుగు భాగం రాగానే ప్రతిధ్వని వస్తుంది. ప్రతిధ్వనిని  పసిగట్టేలా ఆ పడవలో రిసీవర్ కూడా ఉంటుంది. ఆ ప్రతిధ్వని యొక్క తీవ్రతను బట్టి ఆ నది లేకపోతే సముద్రం ఎంత లోతు ఉన్నది అన్న విషయం మనం తెలుసుకోవచ్చు.  ధ్వని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చా?  అని అనిపిస్తుంది కదా! మనకు తెలియని కొత్త విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ! ఇలాంటి ఎన్నో కొత్త ఆసక్తికరమైన విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. టచ్ లో ఉండండి మొలకతో...... తెలుసుకుంటే అబ్బురపోయే విధంగా ఉన్న ఎన్నో కొత్త విషయాలను నేను తెస్తూ ఉంటాను.  ఓకే ఫ్రెండ్స్!మళ్లీ కలవనా మరి? బాయ్ ఫ్రెండ్స్!👋 టాటా ఫ్రెండ్స్!🥳 
కామెంట్‌లు