బియ్యం రేటు వింటేనే గుండె దుభేల్మంటోంది. గుండెల్లో దడ పుట్టించేలా తెలుగు రాష్ట్రాలలో బియ్యం ధరలు పెరిగి పోయింది. పదులు కాదు, వందలు కాదు ఏకంగా వేలల్లో ధరలు పెరగడంతో ప్రజలు హాహాకారాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇవే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే బియ్యం కొనలేని పేద, మధ్యతరగతి ప్రజలు పస్తులతో కాలం గడపాల్సిన దుస్థితి వచ్చినా రావచ్చు.
నెలరోజుల కిందటి వరకూ బియ్యం ధర సగటున కిలోకు రూ.10 ఇప్పుడు అది రూ.50 మార్కును దాటిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. బిపిటి సన్నబియ్యం క్వింటాలుకు 100 పెరిగి రూ.4,200 నుంచి రూ.15కు చేరింది. గుంటూరులో పండే నాణ్యమైన సన్నబియ్యం రకం రూ.వెయ్యి పెరిగి రూ.4200 నుంచి రూ.5200కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే హెచ్‌ఎంటి స్లిమ్స్ బియ్యం ధర రూ.14 పెరిగి రూ.4,230 నుంచి రూ.5000 వరకూ వెళ్లింది. మరో రెండు, మూడు రోజుల్లో క్వింటాలుకు రూ.2 నుంచి 4 వందల వరకూ రేటు పెరుగుతుందని మిల్లర్లు చెబుతున్నారు. బియ్యంధరలు పెరగనున్నాయని మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల పట్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఏరోజుకారోజు బియ్యం ధరలు పెరుగుతుండడంతో బియ్యం వ్యాపారస్థులు చెలరేగిపోతున్నారు. కత్రిమ కొరతను సృష్టించి ప్రజలపై అధిక ధరల భారాన్ని నెట్టేస్తున్నారు. డిమాండ్ కంటే తక్కువ బియ్యం సరఫరా చేయడం ద్వారా కత్రిమ కొరతను చూపిస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి మిల్లర్లు, వ్యాపారస్థులపై కొరడా ఝులిపించాలని ప్రజలు కోరుతున్నారు.ఇక ఇటీవలి కాలంలో మరొక ప్రచారం ప్రాచుర్యంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నూతన రై ఎక్పోర్ట్ పాలసీ ప్రకారం ఇతర రాష్ట్రాలకు బారీ ఎత్తున ఎగుమతులు అవుతున్నాయని, బియ్యం లభ్యత తగ్గిందని ప్రచారం చేస్తూ వ్యాపారస్థులు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ భయాందోళనలతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారని ఒక వార్త ఇప్పుడు ప్రచారంలో వుంది.
ఇక ప్రభుత్వం వైఖరిపై విపక్షాలు ద్కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఎంతో ఆర్బాటంగా ధరల స్థిరీకరణ కోసం రూ.వేల కోట్ల నిధులు కేటాయించామని చెప్పిన ప్రభుత్వం బియ్యం ధరను స్థిరీకరించడానికి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ముజూరు చేయలేదు. ధరల మోతతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదు, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని టిడిపి, జనసేన, బి జె పిలు ఇప్పటికే ప్రకటించాయి. బియ్యం ధరల పెరుగుదలకు ఎగుమతులకు అనుకూల వాతావరణం ఏర్పడటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్ దిగుమతి సుంకాన్ని 25 నుంచి 15.5 శాతానికి తగ్గించింది.
దీంతో మన దేశంలో బియ్యం ఎగుమతులు ఒక్కసారిగా ఐదు శాతం పెరిగా యి. బియ్యం ధరలతో పాటు గోధుమల ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వ అధికారులు కోటా బియ్యం లారీలను చాలా చోట్ల పట్టుకుంటున్నారు. అయినా, యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిపోతోంది. జీఎస్టీ భారంతో బియ్యం వ్యాపారం సక్రమంగా సాగడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో బియ్యం వర్తకులు నిల్వ ఉంచుకునే వారనీ, ఇప్పుడు ఎంత లాభం వస్తే అంతకు అమ్మేస్తున్నారని, ఎక్కడా నిల్వ ఉండటం లేదని చెబుతు న్నారు.
మన దేశం చాలా బియ్యం రకాల ఎగుమతులను నిషేధించనుంది. దేశీయంగా ధరలను అదుపులో ఉంచడంతో పాటు, ఎల్‌నినో ప్రభావం కూడా ఉంటుందని వార్తలు వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. బాస్మతి బియ్యం మినహా అన్ని రకాల బియ్యం ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంని సంబంధ వర్గాలు వెల్లడించాయి. దేశీయంగా మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీసుందని, దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఆ వర్గాలు తెలిపాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి