పరివర్తన,;- బి.దీక్షిత,-10వ.తరగతి,-తెలంగాణ ఆదర్శ పాఠశాల,-బచ్చన్నపేట మండలం,-జనగామ జిల్లా.

 రామాపురం అనే గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలతో నివసించేవాడు.అతడు చాలా కష్టపడి పనిచేసేవాడు.తన భార్య లక్ష్మి కూలీ పనులకు వెళ్లి పిల్లలను చక్కగా చూసుకునేది.సోమయ్యకు బాగా తాజి అలవాటు ఉండేది.తను పనిచేయగా వచ్చిన డబ్బులతో సోమయ్య తాగి ఆరోగ్యం పాడు చేసుకునేవాడు. భార్యను కొట్టెవాడు.పిల్లల చదువులకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు.వైద్య ఖర్చులకు అప్పులు బాగా అవుతాయి.
ఇదంతా గమనించిన సోమయ్య పిల్లలు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్తారు. ఒకరోజు సోమయ్యను పాఠశాలకు రమ్మని చెప్తారు ఉపాధ్యాయులు.సోమయ్య పాఠశాలకు వెళ్తాడు.ఆ రోజు ఉపాధ్యాయులు ఒక చెడు అలవాటు వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో సోమయ్యకు తెలియచెప్తారు.భార్య, పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారో వివరిస్తారు. తాగడం వల్ల ఆరోగ్యం ఎలా చెడిపోతుందో సోమయ్యకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తారు.ఏమన్నా అయితే నీ భార్య పిల్లలు బజార్లో పడతారని వివరంగా అతనికి అర్థం అయ్యేటట్టు చెప్తారు.ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విన్న సోమయ్య ఏడుస్తూ ఇంకెన్నడు తాను తాగనని బాగా పనిచేసి నా భార్యా పిల్లల్ని చక్కగా చూసుకుంటానని ఉపాధ్యాయులతో చెప్తాడు. అక్కడే ఉన్న వాళ్ళ ఇద్దరూ పిల్లల్ని దగ్గరకు తీసుకొని బాగా ఏడుస్తాడు.పిల్లలు ఇద్దరు కూడా తండ్రి అలా దగ్గరగా పట్టుకోవడం వల్ల చాలా సంతోషిస్తారు. సోమయ్యలో పరివర్తన రాసాగింది.అతను తాగడం మానడమే,కాకుండా కష్టపడి పనిచేసి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాడు.తన ఇద్దరు పిల్లలను బాగా చదివించి, ప్రయోజకులను చేస్తాడు.ఆ ఊరు ప్రజలంతా సోమయ్య లో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషిస్తారు.ఆ ఊరిలో ఒక కట్టుబాటు తీసుకువస్తారు.ఎవరు తాగి సంసారాలు ఆగం చేసుకోవద్దని గ్రామపంచాయతీ వద్ద తీర్మానం చేస్తారు. పిల్లలను చక్కగా చదివించాలని ప్రతిజ్ఞ చేస్తారు.
అప్పటినుండి ఆ ఉరి ప్రజలందరు మందును తాగడం మానేస్తారు.ఆదర్శ గ్రామంగా ప్రభుత్వం నుండి గుర్తింపును పొందుతుంది.ఆ గ్రామానికి అనేక పురస్కారాలు వస్తాయి.
కామెంట్‌లు