కేసిరెడ్డిపల్లి అనే గ్రామంలో అజయ్ అనే విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతుండేవాడు.అతనికి చదువు కంటే కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టం.ప్రతిరోజు పొద్దున,సాయంత్రం తన స్నేహితులతో కబడ్డీ ఆట ఆడుతుండేవాడు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు కబడ్డీ ఆడిపిస్తున్నప్పుడు బాగా పరిశీలించేవాడు.చక్కగా ఆడుతుండేవాడు. ఎప్పటికైనా కబడ్డీ ఆటలో రాష్ట్రస్థాయి ఆటగాడు కావాలని,తద్వారా మంచి ఉద్యోగం సాధించాలని కోరుకునేవాడు.
కానీ చదువును నిర్లక్ష్యం చేసేవాడు.అది గమనించిన ఉపాధ్యాయులు నువ్వు చక్కగా చదువుకుంటే నీకు భవిష్యత్తులో కబడ్డీ ఆటలో మంచి అవకాశాలు వస్తాయని తెలియజేస్తారు. అప్పటినుండి అజయ్ పొద్దున,సాయంత్రం కబడ్డీ ఆటలో మెలకువలు నేర్చుకుంటూ,పాఠశాలలో చక్కగా చదువుకునేవాడు. పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో చేరి కబడ్డీ ఆట మీద ఇంకా బాగా దృష్టి సారించాడు.
జిల్లా,రాష్ట్ర స్థాయిలలో జరిగే పోటీలలో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు.అది గమనించిన కబడ్డీ శిక్షకులు అతనికి ఆటలో మరిన్ని మెలకువలు నేర్పించారూ.
డిగ్రీ స్థాయిలో ఎన్.సి.సి లో చేరి మంచి క్రమశిక్షణతో ఉండేవాడు. చదువుకుంటూనే కబడ్డీ పోటీలలో పాల్గొని యూనివర్సిటీ స్థాయిలో అనేక బహుమతులు పొందినాడు.కబడ్డీ ఆట ద్వారా స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాడు.తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకున్నాడు.పోలీస్ శాఖ తరఫున కబడ్డీ పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి