విజయం సాధించిన చంద్రయాన్ - 3 వ్యోమ నౌక- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
జయ జయహో భారత్
వెండి వెన్నెల పై చేసింది
భారత ఇస్రో సంతకం 
శాస్త్రవేత్తల విజయానికి నాంది!!

23.8.2023 రోజు
సాయంత్రం సమయం
ఆరు గంటల నాలుగు నిమిషములకు
జాబిల్లిపై దిగి నిలిచింది!!

చంద్రయాన్ - 3 సక్సెస్ 
గన విజయాన్ని సాధించి
చంద్రుడిపై చరిత్ర సృష్టించింది
దేశమంతా మిన్నంటిన సంబరాలు!!

అమెరికా రస్య  జపాన్
దేశాలు సాధించలేని దాన్ని
భారత శాస్త్రజ్ఞులు
సాధించి చూపించారు!!

41 రోజుల ప్రయాణం చేసి
చందమామనందుకుని
ఆలింగనము చేసుకుంది
ఈ సుధీనం భారతీయులు
మరువరు మరువరు ఎప్పటికీ మరువరు!!


కామెంట్‌లు