మేం బాలలం!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.8309529273.
పరిమళాలు వెదజల్లే
గులాబీ మొగ్గలు మీరు!!

మహా మొక్కలుగా మారే
మొలకలు మీరు!!!!

గలగల పారే
సెలయేరులు మీరు!!!!!!!

సజీవ నదులు మీరు!!
ఎత్తు నుంచి దుమికి పారే
జలపాతాలు మీరు!!!!!!!!!

సముద్రం ముద్దాడిన
మేఘాలు మీరు!!!!!!

ఆకాశం మీది నుంచి
రాలిపడే నీటి ముత్యాలు మీరు!!!

అంతరిక్షంలో ఎగిరే
నక్షత్రాలు మీరు!!!!!!

ఎవరు మీరు ఏ ఊరు మీది ఏ దేశం మీది!!

మేం బాలలం
భారతీయులం భారతదేశం మాది!!!

మా చిరునవ్వే త్రివర్ణ పతాకం!!!!!!
చదువే మాకు బంగారు పతకం!!!
గురువులే మాకు గర్వం!!!!!!!!!!! !!
మా పాఠశాలే మాకు గృహం!!

మేం బాలలం భారతీయులం
మా చిరునవ్వే త్రివర్ణ పతాకం!!!!!

15th August స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.2023.


కామెంట్‌లు