గజేంద్ర మోక్షం (11నుండి16)
---------------------------------------
గజరాజుగ వెలిగాడు
పరమాత్మను మరిచాడు
బంధుత్వపు మాయలబడి
తననుతాను మరిచాడు
కొండను ఢీకొట్ట గలడు
పిడుగులు బడినా బెదరడు
నడక రాజ దర్పము
దేనికి వణుకడు జంకడు
ఏనుగుల సమూహాలు
ఏడికేగిన గుంపులు
ఆ గాంభీర్యము జూసి
ఎదురే రావట పులులు
ఎదురులేని వాడుగా
వనములోన నడువగా
ప్రతి ప్రాణి భయముతో
దాగేనట చాటుగా
అడవులంటెనే సింహం
గర్జించుటయే నైజం
ఐనా కరి గుంపు జూసి
గహను దాటదంట మృగం
నల్లని కొండల విధము
మేఘము కమ్మిన విధము
ఏనుగు గున్నల గుంపులు
చీకట్లలిమిన విధము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి