ఆధ్యాత్మిక కందాలు;- మమత ఐలకరీంనగర్-9247593432
 ధర్మనీతి
=======
క.
ధర్మము న్యాయము సత్యపు
మర్మము తా నెదుట నుండ మహిమ దెలియకన్
కర్మంబని తలపోయక
నిర్మల హృదయంబు విప్ప నీడయె తల్లీ..!
క.
ఆత్మలు దేహంపొందుచు
ముత్యము వలె దిద్దు కొనగ పుడమిని జేరన్
నిత్యానికి స్ర్తీ పురుషులు
సత్యంబు  ప్రకృతిపురుషలు సౌమ్యత గనగన్
క.
పురుషులు కుడి భుజమువోలె
తరుణిని మోయగ నెడమన త్రాసుకు సమమై
మిరుమిట్లు గొల్ప ధర్మము 
పురివిప్పుచు నాట్యమాడు పుడమిన మనసా!

కామెంట్‌లు