ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐలకరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (64నుండి 68)
=======================
ఏనుగు గున్నల నడవడి
పోతన పద్యంబుల సుడి
అలవిగాని వర్ణనతో
చూపెను అక్షర ఒరవడి

దట్టమైన గుంపులట
లక్షకు పైగుండె నట
సాయంత్రం గుహలనుండి
నీటి కొరకు తరలునట

చీకట్లు మసిరి నట్లు
మేఘాలు కమ్మినట్లు
గుంపులు గుంపులతోడ
వచ్చును ఏనుగులట్లు

అడవి వాటి నడకతో
వణుకునంట భయముతో
సమస్తంబు పారిపోయి
నుండు నిశ్శబ్దంతో

ప్రకంపనందు సింహాలు
ఇతరత్ర ఖడ్గమృగాలు
గహలందు జొరబడి
నక్కేను భళ్ళూకములు


కామెంట్‌లు