హరివిల్లు 71
🦚🦚🦚🦚
మాటకు మాట పలుకుచు
లొంగక బదులిచ్చు *మాట*......!
పరస్పర మనస్పర్థై
వాగ్వివాద *యుద్ధమంట*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 72
🦚🦚🦚🦚
ప్రకృతి ఆకృతుల
ఎదుట తాదాత్మ్య తపస్సు......!
అద్భుతమైన జగత్తును
ఆస్వాదించే మనస్సు............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 73
🦚🦚🦚🦚
జీవన సమరమున
అతిశయించిన ఆలోచన.......!
అధిగమించి నడుచు వాంఛ
శక్తికి మించిన తపన..............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 74
🦚🦚🦚🦚
గ్రామ జనులకు తెలియటకు
చావడిలో *చాటింపులు*.......!
వినుట సహించని కొందరి
సహజత్వపు *పట్టింపులు*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 75
🦚🦚🦚🦚
స్వార్థమనెడి తడిముడులు
తొలగని నరకయాతనలు........!
నిస్వార్థ అభ్యాసముల
వలన తొలగును ఇడుములు....!!
(ఇంకా ఉన్నాయి)
హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్- 9440522864
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి