హరివిల్లు 86
🦚🦚🦚🦚
అశాశ్వతపు శరీరం
శత భోగ తాపత్రయం...!
విశృంఖలపు విహారం
సహస్ర రోగ వలయం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు. 87
చేతి నిండ పని వుంటే
కడుపు నిండా తిండి......!
కంటి నిండ నిద్రుంటే
ఆరోగ్యం వదలదండి.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 88
🦚🦚🦚🦚
సొగసైన సృష్టిలో
సరైన నిర్ణయాలు....!
తనదైన శైలిలో
ప్రోగైన అనుభవాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు. 89
🦚🦚🦚🦚
నేడే మేడే అనుడే
అంతు లేని బాదుడే...!
శ్రమపడి తిరుగుడే
వారి శ్రమ దోపిడే......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 90
🦚🦚🦚🦚
నిండుగ ధ్యానించు హరి
నామము సులభమె కదా...!
రెండక్షరాల నామమె
దండిగ రక్షించును సదా......!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి