హరివిల్లు 36
🦚🦚🦚🦚
మనో వికాసపు శాంతి
గొప్ప సంపదై గెలుచును.....!
ఇది ఎవరును గైకొనక
విలువైనదిగా నిలుచును......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 37
🦚🦚🦚🦚
రాలే పూలను చూస్తూ
నేల రాల్చకు కన్నీళ్ళు.......!
చెట్లకు పూలు పూసేట్లు
చేయాలి ఉన్నన్నాళ్ళు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 38
🦚🦚🦚🦚
నేల రాలి పడుతున్న
ఆకును కాను నేను...!
చిగురించి ఎదిగి, నీడను
ఇచ్చే చెట్టును నేను........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 39
🦚🦚🦚🦚
కొబ్బరి నీరు త్రాగిన
జబ్బు లెన్నో తగ్గునట.........!
డబ్బు లిచ్చి కొన్న నీరు
దాని ముందు దిగదుడుబట...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 40
🦚🦚🦚🦚
సంసార కాలకూట
విషం మనల వెంటాడును....!
గురు చరణ కమలములు
విష విరుగుడుకు సరిపడును.....!!
కాసుల ధీరాజ శర్మ,
తూప్రాన్, మెదక్ జిల్లా.
(ఇంకా ఉన్నాయి)
హరివిల్లు రచనలు,-కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి