రక్షాబంధనం!;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 9441058797.

 రాఖీ పౌర్ణమి,శుభాకాంక్షలతో!
=====================
         1. సోదరి అనంత ,
                   ఆపేక్ష చిహ్నం!
    సోదర అహర్నిశ ,
                    రక్షా వాగ్దానం!
   ఇల సోదర సోదరీ ,
        అనన్య అనుబంధం !
  మారిపోని ,
             ఒకే రక్త సంబంధం!
  ఇగిరిపోని ,
           ఆత్మీయ సుగంధం!
2. సోదరి తల్లి ప్రతి రూపం! సోదరుడికి సదా అపురూపం!
 సోదరుడు పుట్టింటి ప్రతినిధి!
  సోదరి ఆప్యాయత పెన్నిధి!
 పురుషుడికి ఎన్ని ఉన్నా!
 ఓ సోదరి ఉంటే అది!
 వెల కట్టలేని ప్రాపర్టీ!
 స్త్రీకి సైతం!,
ఓ సోదరుడు ఉంటే !
అది జెడ్ ఆర్డర్ సెక్యూరిటీ!
3.స్త్రీ ఓఇంటి ఇల్లాలు, సత్యం! 
  పుట్టింటిలో స్థానం కడుభద్రం! 
  ఆడపడుచు హోదా శాశ్వతం!
  పుట్టింటికి వస్తే,
             హర్షం పన్నీరు వర్షం!  
 తిరిగెళ్ళుతుంటే,
          ఆగని ఆనంద బాష్పం! సోదరుడు ఇచ్చేది,
                పసుపు కుంకుమ!
 ఆశీర్వదించేది,
            దీర్ఘసుమంగళీ గరిమ!
4. "అన్న" చేయి వేలిగాయం!
      తన చీర చెంగు చించి !
     ద్రౌపది కట్టిన వైనం !
    మాన రక్షణ సమయం!
    అనంత వస్త్ర దానం!    
    పురుషోత్తముడి చేతికి!
     కట్టిన రాఖీ సాక్ష్యం!
   అలగ్జాండర్ కు లభించే!
   అద్భుత ప్రాణదానం! 
  తరతరాల , రక్షాబంధనం!
  అన్నాచెల్లెళ్ల శ్రేయో కారకం!
____'_''____

కామెంట్‌లు