నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత..;- శిరందాస్ శ్రీనివాస్-- నిజాం వైద్య విజ్ఞాన సంస్థ-హైదరాబాద్..-9441673339
మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా..
ముప్పై కోట్ల భారతీయులను
ఏక తాటి పైకి తెచ్చిన జెండా
స్వతంత్ర్య కాంక్షను రగిలించిన జెండా...
స్వాతంత్రోద్యమానికి ఊపిరులు ఊదిన జెండా..  
నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత.. 1


ఆగస్ట్ 7, 1906 న
తొలిసారి కలకత్తా వీధుల్లో
వందే మాతరం అంటూ నినదించిన జెండా..
స్వాతంత్య్రం నా జన్మ హక్కు అన్న
బాల గంగాధర తిలక్ నినాదం
ఉప్పెనలా ఎగదోసిన జెండా..
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంతో 
సత్య నిష్ఠను చాటిన జెండా
అనిబ్ సెంట్ హోమ్ రూల్ ఉద్యమంతో భారతీయులను 
ఏకం చేసిన జెండా
క్విట్ ఇండియా అంటూ 
బ్రిటిషర్లకు చుక్కలు చూపిన జెండా
జాతిని ఏకం చేసిన  మువ్వన్నెల జెండా..
జాతీయ భావాన్ని ప్రాదుకొల్పిన జెండా..
నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత.. 2

మన పింగళి వెంకయ్య రూపునిచ్చిన మూడు రంగుల జెండా 
మన ఆకాంక్షలు వెలువరించిన జాతీయ జెండా.. 
తెల్లదొరలకు ముచ్చ్చమటలు పట్టించిన మువ్వన్నెల జెండా..
ఆగస్ట్ 15, 1947 న ఎర్ర కోట పై 
ఎగిరిన జెండా..
నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత.. 3


జెండా లోని కాషాయం ధైర్యం,  త్యాగానికి ప్రతీక.
తెలుపు శాంతి, సత్యాలకు నిదర్శనం 
ఆకుపచ్చ  విశ్వాసం, శౌర్యానికి ప్రతీక
నీలి అశోక చక్రం ధర్మ నిరతికి 
కాల గతికి సంకేతం. 
ఇంతటి మహత్తర సందేశం ఇచ్చే నా దేశ పతాకం నాకు సదా స్ఫూర్తి ప్రేరకం 
దేశ భక్తిని రగులు కొల్పు జాతీయ పతాకం..
సారే జహా సే అచ్చా హిందూసితా హమారా అని చాటి చెప్పు 
విజయ పతాకం..
నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత.. 4

స్వతంత్ర భారతావనిలో
రెప రెప లాడే మువ్వన్నెల జెండా
భారత స్వాతంత్ర్య దినోత్సవాన 
యావత్ప్రపంచమే ఎగురవేయగా
నా హృదయం పులకించిపోగా..
ఇదేరా నేను కలలుగన్న భారతం
విశ్వ గురువు భారతం
అని హృదయం ఉప్పొంగి పోగా..
నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత.. 5


నా స్వాతంత్ర్య సంబరం
ఎన్నో దేశాలకు ప్రీతి పాత్రం  
నా దేశ స్వాతంత్య్రం ఎన్నో దేశాలకు ప్రేరణ 
నా దేశ విజయం ఎందరికో సంబరం..
శాంతి కాముక నా దేశం 
ప్రపంచ దేశాలకు భరోసా..
నా దేశ జాతియ పతాక సదా స్ఫూర్తి ప్రదాత.. 



కామెంట్‌లు