బంగారు పంట సిరులునిండైన జలనిధులుకలిగి ఉన్న మననేల!ఘనమైన తెలుగునేల!!విశాల సాగరతీరంగనులు, గిరులు, తరులుసిరులు కలిగిన నేల!ఘనమైన తెలుగునేల!!కూచిపూడి నాట్యాలురామప్ప శిల్పాలుసర్వకళల హారమై!నిలిచిందీ తెలుగు నేల!!ఉరకలేసే ఝరులుఉన్నత జలపాతాలుకలిగి ఉన్న మననేల!ఘనమైన తెలుగునేల!!ఇంటింటా తులసి కోటముంగిట్లో ముగ్గుళ్ళుచక్కని నందనవనాలు!కలిగున్నది తెలుగునేల!!అరుదైన జంతువులువన్నెచిన్నెల పక్షులురమణీయ తరులతలు!కలిగున్నది తెలుగునేల!!నీతిశాస్త్ర కోవిదులుదీనజనోధ్ధారకులకునిలయం కదా! ఈ నేల!ఘనమైన తెలుగునేల!!మండే విప్లవ వీరులుమహనీయులు, మేధావులుమాననీయ మానవతులు!కన్నది ఈ తెలుగు నేల!!ఆపన్నులకు అండగాఅమ్మ అన్నపూర్ణ గాసౌభాగ్య సీమ గాను!అవతరించే! తెలుగు నేల!!
తెలుగునేల (బాల గేయం);- రావిపల్లి వాసుదేవరావు- పార్వతీపురం9441713136
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి